విద్యతోనే ఉజ్వల భవిష్యత్
కొరుక్కుపేట: విద్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని లైఫ్‌లైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ జాయింట్ డైరెక్టర్ ,వైద్యులు డాక్టర్ అనిరుధ్ తెలిపారు. ఈ మేరకు ఎస్‌కేపీడీ అండ్ ఛారిటీస్ నిర్వహణలో కొనసాగుతున్న మహర్షి విద్యా మందిర్ (ఎంవీఎం)సీనియర్ సెకండరీ స్కూల్ –చూలై 11వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. దీనికి చైన్నె తేనాంపేటలోని కామరాజ అరంగం వేదికై ంది. పాఠశాల కరస్పాండెంట్ టీవీ రామకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ అనిరుధ్ రాజ్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ఆరంభించారు. అనంతరం వివిధ పోటీలతోపాటూ విద్యలో ప్రతిభను కనపరుస్తున్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందించిన ఆయన మాట్లాడుతూ జీవితంలో పాఠశాల విద్యను మరవలేమని అన్నారు . పాఠశాల ప్రదానోపాధ్యాయులు పి. సుబ్రమణ్యం పాల్గొన్నారు.


