మేధాశక్తితోనే ఉన్నత శిఖరాలకు
వేలూరు: మేధాశక్తితోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరకోగలరని సినీ హాస్య నటుడు మదురై ముత్తు అన్నారు. వేలూరు శ్రీపురంలోని బంగారుగుడి, శ్రీ నారాయణి పీఠం పీఠాధిపతి శక్తిఅమ్మ 50వ జయంతి దినోత్సవాన్ని పురష్కరించుకొని నారాయణి పాఠశాలలోని విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు బంగారుగుడి డైరెక్టర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే విద్యార్థులు క్రమ శిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. పీఠాధిపతి శక్తిఅమ్మ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వీటిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రిన్సిపల్ రమేష్, సుబ్రమణి, లక్ష్మి, ఊరీస్ కళాశాల ప్రొఫెసర్ జాన్‌బాబు, నారాయణి పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


