స్టార్టప్‌ల కోసం యంగ్ ఇండియన్స్ ఏకం
సాక్షి, చైన్నె: యువ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్, బీబీఐసీ 2.ఓ నేషనల్ ఫినాలేలో భాగంగా అతి పెద్ద స్టూడెంట్ స్టార్టప్ షోకేష్ కోసం యువత ఏకం అయ్యారు. ఒకే వేదికగా 900 మందికి పైగా యువత ప్రేరణ, అభ్యాసం, జాతీయ స్థాయి స్టార్టప్ పిచింగ్ కోసం ఒకే వేదిక మీదకు వచ్చారు. సీఐఐలో భాగంగా ఉన్న యంగ్ ఇండియన్ (వై) చైన్నె నేతృత్వంలో అత్యంత ప్రభావవంతమైన వ్యవస్థాపకత, శక్తి వంతం, యువత భాగస్వామ్యం గురించి స్టార్టప్ జట్లు భారత్ బిలియన్ ఇంఫాక్ట్ ఛాలెంజ్ 2.ఓకు చర్యలు తీసుకున్నారు. ఈ ఫినాలేలో యువ సమూహంతో కూడిన టాప్ 3 స్థానాలలో కోయంబత్తూరు హెల్పింగ్ హ్యాండ్స్, మదురై ఫుడ్ షీల్డ్, ఈరోడ్ బన్రావ్‌లు నిలిచాయి. విజేత జట్టుకు తాజాగా ఐఐటీ మద్రాసులో ఇంక్యుబేషన్ లభించనుంది. విద్యార్థుల ఆవిష్కరణలు, స్టార్టప్ అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా యంగ్ ఇండియన్స్, ఐఐటీ మద్రాసు ముందుకుసాగనున్నాయి. ఈ కార్యక్రమానికి నేచురల్స్ సహ వ్యవస్థాపకుడు సికే కుమర వేల్, స్టార్టప్ సింగం సీఈఓ అరుణ్‌నాయర్, కేఆర్‌ఈఏ చైర్మన్ ప్రవీణ్ శేఖర్, వర్క్ ఫాస్ట్ ఏఐ వ్యవస్థాపకుడు సురేష్ హాజరై యువత కలలు, స్థితి స్థాపకత, వ్యవస్థాపకత, మార్కెటింగ్, భవిష్యత్తు టెక్ స్టార్టప్‌లను గురించి విశదీకరించారు.


