డివైడర్‌ను ఢీకొన్న కారు
–ఇద్దరు దుర్మరణం
అన్నానగర్: డివైడర్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన ధువరంకురిచ్చి సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. మదురై జిల్లాలోని నాగమలై పుదుక్కోట్టైకు చెందిన పాట్రిక్ (55) మదురైలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్. ఇతని భార్య చైన్నె కొలత్తూర్ పోలీస్‌స్టేషన్‌న్‌లో సీఐ. వీరి కుమారుడు మెల్విన్ (32) చైన్నెలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. కోడలు ఆరోగ్య ప్రిస్సిల్లా (26). పాట్రిక్ తన కుమారుడు, కోడలితో కలిసి చైన్నె వెళ్లి శుక్రవారం రాత్రి కారులో మధురైకి తిరిగి వెళుతున్నాడు. కారును మెల్విన్ నడుపుతున్నాడు. శనివారం ఉదయం 9 గంటలకు భారీ వర్షం కురుస్తుండడంతో కారు అదుపుతప్పి తిరుచ్చి జిల్లాలోని ధువరంకురిచ్చిలోని మదురై జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో పాట్రిక్ అక్కడికక్కడే మృడిచెందాడు. తీవ్రంగా గాయపడిన ఆరోగ్య ప్రిస్కిల్లా, మెల్విన్‌లను మదురైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యప్రిస్కిల్లా మృతిచెందింది. సమాచారం అందుకున్న కురిచి పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాట్రిక్ మృతదేహాన్ని శిథిలాల నుంచి వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం మనప్పారై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పాలిటెక్నిక్ కళాశాల
నిర్మాణ పనుల పరిశీలన
కొరుక్కుపేట: చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ తరపున ఉత్తర చైన్నె డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద రూ. 46.50 కోట్ల ఆర్థిక సహకారంతో నిర్మిస్తున్న తిరువొత్తియూర్ ప్రభుత్వ సాంకేతిక కళాశాల, ప్రభుత్వ వత్తి శిక్షణ సంస్థ పనులను మంత్రి, చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ పి.కె. శేఖర్‌బాబు పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనల మేరకు, ఉత్తర చైన్నె అభివద్ధి ప్రాజెక్టు కింద, ఒక పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ,సాంకేతిక కళాశాల నిర్మాణం కూడా వేగంగా జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే కె.పి. శంకర్, చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ గోప్రకాష్ పాల్గొన్నారు.


