ఉన్నత విద్యతోనే దేశాభివృద్ధి
వేలూరు: ఉన్నత విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ విశ్వనాథన్ తెలిపారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని అందరికీ ఉన్నత విద్యా పథకం కింద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. ఈసందర్భంగా విద్యార్థులకు విద్యా స్కాలర్‌షిప్ చెక్కులను అందజేశారు. చాన్సలర్ మాట్లాడుతూ ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా మొట్ట మొదటి సారిగా వేలూరులో అందరికీ ఉన్నత విద్యా పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. విద్యలో తమిళనాడు మొదటి రాష్ట్రంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు శేఖర్ విశ్వనాథన్, కార్యనిర్వాహక డైరెక్టర్ డాక్టర్ సంధ్య, ప్రొ చాన్స్‌లర్ పార్ధసారథిమల్లిక్, ట్రస్ట్ సభ్యులు లక్ష్మణన్, జౌరీలాల్ జైన్, రచయిత పదుమనార్, కేఎంజీ రాజేంద్రన్, వ్యాపారుల సంఘం జిల్లా అద్యక్షుడు జ్ఞానవేల్, తమిళనాడు హోటల్ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటసుబ్బు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


