నేడు వేమన ఆలయ మహాకుంభాభిషేకం
పళ్లిపట్టు: భాషాభిమానం నిండిన తమిళనాట తెలుగుకవి యోగి వేమనకు ఆలయం నర్మించి పూజిస్తున్న ఘటన అత్తిమాంజేరిపేటలో గుర్తింపు పొందుతోంది. 17వ శతాబ్దానికి చెందిన యోగివేమన పద్యాలు సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండేవి. అత్తిమాంజేరిపేటలో వేమన పద్యాలు నేర్చుకున్న ఎందరో పూర్వీకులు వేమనకు ఆలయం నిర్మించి పూజలు మొదలుపెట్టారు.
వేమనకు కొత్త ఆలయం
రెండు వందల సంవత్సరాల వేమన ఆలయం దుస్థితికి చేరుకోవడంతో గ్రామీణులు కలిసికట్టుగా నిధులు సమకూర్చి వేమనకు కొత్త ఆలయం నిర్మించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మహాకుంభాభిషేకం వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాగశాలలు ఏర్పాటు చేసి హోమగుండం పూజలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఆలయ మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు.


