జిల్లా అధ్యక్షుడి నియామకంపై కసరత్తు
తిరుత్తణి: కాంగ్రెస్ నూతన జిల్లా అధ్యక్షుల ఎంపికకు సంబంధించి కార్యకర్తల నుంచి అభిప్రాయం సేకరించి కొత్త అధ్యక్షులను నియమించనున్నట్లు పరిశీలకులు తెలిపారు. తమిళనాట త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ బలోపేతం చేసి విజయం సాధించడం లక్ష్యంగా జిల్లాలకు కొత్త సారథులు నియమించేందుకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించి కొత్త సారతులు నియమిస్తున్నారు. ఇందుకోసం పరిశీలకులను నియమించి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరువళ్లూరు నార్త్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి కేజీ కండ్రిగలో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దురైచంద్రశేఖర్, మాజీ అధ్యక్షుడు ఏజీ.చిదంబరం పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు సందీప్ కార్యకర్తలు వద్ద విడివిడిగా వారి అభిప్రాయాలు సేకరించి రికార్డు చేశారు. కార్యకర్తల అభిప్రాయాలు సేకరించిన తర్వాత కొత్త సారిథి నియామకంకు సంబంధించి ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇందులో పార్టీ రాష్ట్ర నేత వెంకటరాజు, రాష్ట్ర కార్యదర్శి గోవిందరాజ్, మండల కార్యదర్శి ఏలుమలై, నగర కార్యదర్శి రామకృష్ణన్ పాల్గొన్నారు.


