తీరానికి సమీపంలో..
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ ప్రస్తుతం శ్రీలంక మీదుగా ఉత్తర–వాయువ్య దిశలో పయనిస్తోంది. ఇది శనివారం తమిళనాడు తీరం వెంబడి ఉత్తర దిశగా కదులుతుందని అంచనా వేశారు. దీంతో రాష్ట్ర విపత్తు నిర్వహణకు చెందిన 16 బృందాలను చైన్నె, చెంగల్పట్లు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో రంగంలోకి దించారు. అలాగే, మరో 12 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. రాష్ట్ర, జాతీయ, అగ్నిమాపక, ప్రత్యేక రెస్క్యూ బృందాలను వేలూరు, తిరువణ్ణామలై, రాణిపేట, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్, పుదుక్కోట్టై, మైలడుతురై, కడలూరు, విల్లుపురం, తిరునెల్వేలి , తూత్తుకుడి జిల్లాలకు శుక్రవారమే పంపిచేశారు. అవసరం అయితే, సేవలకు సిద్ధంగా ఉండాలని ఆర్మీ, నౌక, వైమానిక దళం, ఇండియన్ కోస్టుగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేర వేసే విధంగా చైన్నె ఎలిళగంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్తగా నిండు కుండలుగా ఉన్న రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేస్తూ చర్యలు తీసుకున్నారు. కూవం, అడయార్, కుశస్థలి నదీ తీరాల ప్రజలను అప్రమత్తం చేశారు. అరక్కోణం నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 240 మందితో కూడిన 8 బృందాలు డెల్టా జిల్లాలకు వెళ్లాయి.
గ్రామీణ ప్రాంతాల వైపు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
తీరానికి సమీపంలో..


