టీఎంసీలో కొత్త ఉత్సాహం
సాక్షి, చైన్నె: తమిళ మానిల కాంగ్రెస్‌లో 2026 అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఉత్సాహాన్ని నింపబోతున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జీకే వాసన్ తెలిపారు. ఆళ్వార్‌పేటలో శుక్రవారం తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) ఆవిర్భావ దినోత్సవం జరిగింది. పార్టీ జెండాను జీకే వాసన్ ఎగురవేశారు. కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు. అందరికీ సీట్లు, సహాయకాలను అందజేశారు. బాణసంచా కాల్చుతూ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా వాసన్‌ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జీఆర్ వెంకటేశ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. అనంతరం వాసన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, శాంతి భద్రతలు క్షీణించాయని, డీఎంకేపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆరోపించారు. 2026 ఎన్నికలు టీఎంసీకి కొత్త ఉత్సాహం ఇవ్వబోతోందన్నారు.ఈ సారి తమ ప్రతినిధులు సభలో అడుగు పెట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.


