నటి కృతిశెట్టి
తమిళసినిమా: ఒక్కోసారి అనుకోకుండా, ఎలాంటి ప్రయత్నం లేకుండానే అదృష్టం అవకాశాలు వరించేలా చేస్తుంది. అలా లక్‌తో నాయకిగా కిక్ అయిన నటి కృతిశెట్టి. ఈ బెంగళూరు బ్యూటీ పుట్టింది మాత్రం ముంబయిలో. తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఫ్యాషన్ డిజైనర్. ఇవి చాలు కృతిశెట్టి నటి కావడానికి అర్హతలు. ఈ బ్యూటీకి నటనపై ఆసక్తి ఉండడంతో తొలి ప్రయత్నంగా వాణిజ్య ప్రకటనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అదే ఈమెను సినిమా హీరోయిన్‌ను చేసింది. అలా 17 ఏళ్ల వయసులోనే కథానాయకి అయిన నటి కృతిశెట్టి. మొదటి సారిగా ఉప్పెన అనే తెలుగు చిత్రంలో నాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచెర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ ఇలా పలు చిత్రాల్లో నటించారు. అయితే వీటిలో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు మినహా ఏవీ సక్సెస్ కాలేదు. అంతే అమ్మడి క్రేజ్ తగ్గిపోయింది. అయితే తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లోనూ నటిస్తుండడంతో సౌత్ ఇండియన్ కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఈ అమ్మడు తమిళ ప్రేక్షకులకు ది వారియర్, కస్టడి చిత్రాలతో పరిచయం అయ్యారు. తాజాగా తమిళంలో జీనీ, వా వాద్దియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటిస్తున్నారు. నిజానికి వీటి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యి చాలా కాలమే అయ్యింది. ఈ మూడు చిత్రాలే కృతిశెట్టి కెరీర్‌ను డిసైడ్ చేస్తాయని చెప్పవచ్చు. వా వాద్దియార్ చిత్రంలో కార్తీతో జత కట్టారు. జీనీలో రవిమోహన్ సరసన నటిస్తున్నారు. ఇకపోతే లవ్ ఇన్సూరెన్స్ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్‌తో జత కట్టారు. ఈ మూడు చిత్రాల్లో కార్తీకు జంటగా నటించినా వా వాద్దియార్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కృతిశెట్టి ఇటీవల ఒక భేటీలో తాను హీరోయిన్‌ను ఎలా అయ్యాను అన్నది తెలుపుతూ తాను ఒక వాణిస్య ప్రకటనలో నటించడానికి ఆడిషన్స్‌కు వెళ్లానన్నారు. అది ముగిసిన తరువాత తనను తీసుకెళ్లడానికి తండ్రి రావడం ఆలస్యం అయ్యిందని చెప్పారు. దీంతో ఆ సమీపంలో ఒక స్టూడియో కనిపిస్తే అందులోనికి వెళ్లానని చెప్పారు. అక్కడ ఒక చిత్రం కోసం ఆడిషన్స్ జరుగుతోందనీ, వారు తనను చూసి సినిమాలో నటించడానికి ఆసక్తి ఉందా అని అడిగారన్నారు. దీంతో తాను వారికి తన తల్లి ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చేశానన్నారు. ఆ తరువాత దర్శకుడు చిట్టిబాబు ఫోన్ చేసి మాట్లాడారని, అలా తెలుగులో ఉప్పెన చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశం వచ్చిందని నటి కృతిశెట్టి చెప్పారు. తమిళంలో నటుడు కార్తీ సరసన వా వాద్దియార్, ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటించడం సంతోషంగా ఉందని ఈమె పేర్కొన్నారు.


