వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుడు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం ఉదయం చంద్రశేఖరుడు అద్దాల పెద్ద వెండి వృషభ వాహనంలో మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్తీక దీపోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 5 గంటలకు ఆలయంలోని ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రశేఖర స్వామిని విశేషంగా అలంకరించి వృషభ వాహనంలో కొలువుదీర్చారు. అనంతరం స్వామిని మాడ వీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. అనంతరం 32 అడుగుల పెద్ద రథానికి కలసం చల్లిన గొడుగును ధరింపజేశారు. సాయంత్రం 6 గంటలకు పెద్ద వృషభ వాహనంలో శివుని చిహ్నంగా దుస్తులతో గొడుగు కప్పి మాడ వీధుల్లో ఊరేగించారు. ఉదయం వెండి వృషభ వాహనంలో అన్నామలైయార్ సమేత ఉన్నామలై అమ్మవారు ప్రత్యేక అలంకరణల మధ్య మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
దీపానికి నెయ్యి కానుకలు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్
డిసెంబర్ 3న ఆలయం మహాకొండపై సాయంత్రం 6 గంటలకు మహాదీపాన్ని వెలిగించనున్నారు. ఇందుకోసం గాడ గుడ్డతోపాటు నెయ్యి వినియోగించి దీపాన్ని వెలిగించనున్నారు. ఇప్పటికే అవసరమైన నెయ్యిని కొనుగోలు చేశారు. అయినప్పటికీ భక్తుల నుంచి నెయ్యిని స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు
భక్తులతో కిటకిటలాడుతున్న మాడవీధులు
వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుడు
వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుడు


