అజిత్–64
సెట్స్‌పైకి
తమిళసినిమా: నటుడు అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం గత ఏడాది విడుదలై కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈయన తదుపరి చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందన్న ఆసక్తి నెలకొంది. కారణం అజిత్ ప్రస్తుతం కారు రేసులపై ఎక్కువగా ఆసక్తి చూపడమే. అయితే ఆయన 64వ చిత్రానికి దర్శకుడు ఖరారు అయ్యారు. గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి హిట్ చిత్రానికి పని చేసిన ఆధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీంతో ఈ చిత్రంపై మరింత అంచనాలు నెలకొంటున్నాయి. అయితే ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవతుఉందన్నదే ఆసక్తిగా మారింది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ అజిత్ 64వ చిత్రంపై చిన్న హింట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపు పూర్తి అయ్యాయని, చిత్ర షూటింగ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే ఇందులో అజిత్ పాత్రపై ఇప్పుడే చెప్పలేననీ అన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కోసం లొకేషన్స్ ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం తరువాత మళ్లీ అవకాశం ఇచ్చిన అజిత్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాననీ అన్నారు. ఈ చిత్రం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు. కారు రేసుల ద్వారా ఇండియాకు ఘనతను చేకూర్చిన అజిత్‌తో కలిసి రెండో చిత్రం చేయడం సంతోషంగా ఉందని దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ పేర్కొన్నారు. అయితే ఈ చిత్రాన్ని ఏ నిర్మాణ సంస్థ నిర్మించనుంది, కథానాయకి ఎవరు అన్న ఆసక్తి అజిత్ అభిమానుల్లో నెలకొంది.
అజిత్–64


