భారతీయ రైల్వేలో బెడ్‌రోల్ సౌకర్యం
కొరుక్కుపేట: దక్షిణ రైల్వే చైన్నె డివిజన్ స్లీపర్ క్లాస్ ప్రయాణికుల కోసం పరిశుభ్రమైన బెడ్‌రోల్ సౌకర్యాన్ని అందించనుంది. స్లీపర్ ప్రయాణికుల సౌకర్యం పరిశుభ్రతను మెరుగుపరిచే లక్ష్యంతో, దక్షిణ రైల్వేలోని చైన్నె డివిజన్ ఒక మార్గదర్శక సేవను ప్రవేశపెట్టనుంది. జనవరి 01, 2026 నుంచి నాన్–ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణికులు చెల్లింపుపై పరిశుభ్రమైన బెడ్‌రోల్‌లను పొందవచ్చు. ఇప్పటివరకు స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు బెడ్‌రోల్‌లను అందించే సౌకర్యం అధికారికంగా రూపొందించలేదు. ప్రయాణికుల నుంచి వచ్చిన స్పందన తర్వాత ప్రారంభ దశలో చైన్నె డివిజన్ నిర్వహించే 10 రైళ్లలో మూడేల్లపాటు ఈ సేవ అమలు చేస్తారని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు.


