ఎక్స్‌ఆర్ విప్లవానికి ఐఐటీ నాయకత్వం
సాక్షి, చైన్నె: ఎక్స్‌టీఐసీ గ్లోబల్ సౌత్‌నేషన్స్ కోసం భారత దేశ ఎక్స్‌ఆర్ విప్లవానికి ఐఐటీ మద్రాసు నాయకత్వం వహించనుంది. ఇది భవిష్యత్ సాంకేతిక స్వదేశీ ఆవిష్కరణలను వేగవంతం చేయనుంది. ఐఐటీ మద్రాసులోని ఎక్స్‌పీరియన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్(ఎక్స్‌టీఐసీ)లో గ్లోబల్ సౌత్ కోసం తొలి అంతర్జాతీయ సింపోజియం శుక్రవారం జరిగింది. ఇది భారత దేశాన్ని విస్తరించిన వాస్తవికత(ఎక్స్‌ఆర్) సాంకేతిక పరిజ్ఞానాలలో ముందంజలో ఉంచే విధంగా నిర్వహించారు.
భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ తరంగంలో ప్రయాణిస్తుండగా తర్వాత సాంకేతిక పెరుగుదల ఎక్స్‌ఆర్ ద్వారా నడిపించే లక్ష్యంగా సింపోజియంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. యూనెస్సో మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఒబిజియో ఫోర్ అగినామ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పరిశోధనలు, అంతర్జాతీయ సహకారం, పైలట్ ఇన్నోవేషన్ కార్యక్రమాలను వివరించారు. ఐఐటీ మద్రాసులోని ఎక్స్‌టీఐసీ ప్రిన్సిపల్ ఎం.మణివణ్ణన్ మాట్లాడుతూ ఇండియా ఎక్స్‌ఆర్ కారిడార్, విద్యారంగం, పరిశ్రమ, ప్రభుత్వాన్ని ఏకం చేసే దిశగా స్వదేశి ఐపీ సృష్టి, నైపుణ్య అభివృద్ధి, విస్తరణ గురించి వివరించారు. ఎక్స్‌ఆర్ సాంకేతికతలు, ప్రభావం గురించి ఫిన్లాండ్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ స్టీవెస్ లావాల్లే తెలియజేశారు.


