●అవార్డు
రాష్ట్ర క్రీడలు, స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలోని తమిళనాడు చాంపియన్స్ ట్రస్ట్ క్రీడాభ్యున్నతికి ఇండియా స్పోర్ట్స్ అవార్డు 2025 వరించింది. ఈ అవార్డులను శుక్రవారం డిప్యూటీ సీఎం, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్, కార్యదర్శి అతుల్య మిశ్రా, సభ్య కార్యదర్శి జె.మేఘనాథరెడ్డిలు సీఎం స్టాలిన్‌కు అందజేశారు. – సాక్షి, చైన్నె
మహిళకు లైంగిక వేధింపులు
తిరువొత్తియూరు: పుళల్ సమీపంలో ఒక మహిళను లైంగికంగా వేధించిన కేసులో ఫిజియోథెరపీ డాక్టర్‌ను అరెస్టు చేశారు. పుళల్‌కు సమీపంలోని పుత్తగరం, కదిర్వేడు, శ్రీనివాసన్ నగర్ 3వ క్రాస్ స్ట్రీట్‌కు చెందిన శక్తివేల్(46) గత మూడు సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతను వినాయకపురం ప్రాంతంలో ఫిజియోథెరపీ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. అతను నివశిస్తున్న ప్రాంతంలో 22 ఏళ్ల మహిళ కూడా అద్దెకు ఉంటోంది. ఆ ఇంటి ముందు తన ద్విచక్ర వాహనాన్ని నిలపడంతో, ఆ మహిళ ద్విచక్ర వాహనాన్ని ఇక్కడ నిలపవద్దని, కొంచెం దూరంగా నిలపాలని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఫిజియోథెరపీ డాక్టర్ శక్తివేల్ తన ద్విచక్ర వాహనాన్ని తీస్తున్నట్లుగా తీసి, ఆ మహిళ కాలుపైకి ఎక్కించి గాయపరిచాడు. అంతేకాకుండా ఆ మహిళను నడివీధిలోకి ఈడ్చుకెళ్లి, ఆమె పైవస్త్రాన్ని చించి లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలైన ఆ మహిళ వెంటనే పుళల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు శక్తివేల్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. అనంతరం పుళల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శరవణన్ ఫిజియోథెరపీ డాక్టర్‌ను అరెస్టు చేసి, అతన్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు.
సురక్షిత డిజటల్ లావాదేవీలు లక్ష్యం
సాక్షి, చైన్నె: బీహెచ్‌ఐఎం చెల్లింపు యాప్ సమాజంలోని ప్రతి విభాగానికి డిజిటల్ లావాదేవిలను సరళంగా, సురక్షితంగా అందించడం లక్ష్యంగా చర్యలు తీసుకున్నామని ఎన్‌బీఎస్‌ఎల్ సీఈఓ లలితా నటరాజ్ తెలిపారు. యూపీఐ సర్కిల్ పూర్తి ప్రతినిధి బృందంతో బీహెచ్‌ఐఎం ప్రత్యేక ప్రసారం గురించి, నిర్ణీత పరిమితులలో అధీకృత చెల్లింపు గురించి స్థానికంగా లలిత నటరాజ్ వివరించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా ఎన్‌పీసీఐ బీహెచ్ ఎం సర్వీసు ఉన్నట్టు పేర్కొన్నారు. తాజాగా బీహెచ్‌ఐఎం పేమెంట్స్ యాప్‌లో యూపీఐ సర్కిల్ పుల్ డెలిగేషన్‌ను ప్రవేశ పెట్టామనితెలిపారు. అప్ గ్రేడ్‌లో భాగంగా కొత్త బీహెచ్‌ఐఎం చెల్లింపు యాప్‌లో 4.0.10 తాజా వెర్షన్‌లో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు.


