బాల్య వివాహాలు లేని జిల్లాగా సేలం
కొరుక్కుపేట: ఏడాదిలో సేలంలో బాల్య వివాహాలు లేని జిల్లాగా మారుతుందని ఐసీడబ్ల్యూఓ ప్రతిజ్ఞ చేసింది. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలను నిర్మూలించే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్‌న్‌తో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(ఐసీడబ్ల్యూఓ) సేలంను ఏడాదిలోపు బాల్య వివాహాలు లేని జిల్లాగా ప్రకటించడానికి అన్ని ఏజెన్సీలతో చేయి చేయి కలిపి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసింది. బాల్ వివాహ్ ముక్త్ భారత్ ఏడాది అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ‘100 రోజుల ఇంటెన్సివ్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఐసీడబ్ల్యూఓ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (జేఆర్‌సీ)లో భాగస్వామితో పనిచేస్తుంది. గత ఏడాదిలోనే ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా లక్షకు పైగా బాల్య వివాహాలను నిరోధించింది. బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచారానికి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పాఠశాలలు, సంస్థలు, గ్రామ సంఘాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. జిల్లా అంతటా ప్రతిజ్ఞ వేడుకలను నిర్వహించింది. గత ఏడాదిలోనే 1,019 బాల్య వివాహాలు ఆగిపోయాయని ఎన్జీఓ డైరెక్టర్ ఎ.జె.హరిహరన్ తెలిపారు.


