అఽథ్లెటిక్స్ విజేతలకు బహుమతులు
తిరువళ్లూరు: జిల్లా స్థాయిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను అథ్లెటిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు శివకుమార్ శుక్రవారం ఉదయం అందజేశారు. స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ ఆప్ ఇండియా సహకారంతో అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశంలోని ప్రతి జిల్లాలో ప్రతిభావంతులైన మహిళ అథ్లెట్లను కేంధ్ర ప్రభుత్వం సహకారంతో గుర్తించి వారిని అంతర్జాతీయ, ఒలింపిక్ స్థాయిలో పాల్గోనేలా చేయడడానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 14 నుంచి 16 లోపు వున్న విద్యార్థులకు తిరువళ్లూరు జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు స్థానికంగా ఉన్న క్రీడామైదానంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించారు. ఈ అథ్లెటిక్ పోటీలకు జిల్లాలోని వేర్వేరు పాఠశాలలకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. 200 మీటర్లు, 600 మీటర్లు, జావెలిన్‌త్రో, షాట్‌పుట్, లాంగ్‌జంప్, స్టాండింగ్ లాంగ్ జంప్ తదితర ఏడు రకాల పోటీలను నిర్వహించారు. పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులను అథ్లెటిక్ సంఘం జిల్లా అద్యక్షుడు గుమ్మిడిపూండి మాజీ యూనియన్ చైర్మన్ శివకుమార్, కార్యదర్శి మోహన్‌బాబు తదతరులు పాల్గొని, బహుమతులను అందజేశారు.


