గ్యాంగ్ స్టర్స్ ఇతివృత్తంతో ‘ఫ్రైడే’
తమిళసినిమా: పదవీ దాహం, ధన వ్యామోహం, అందుకోసం చేసే దుర్మార్గాలు, తద్వారా జరిగే పరిణామాలు ఇతివృత్తంతో రూపొందిన చిత్రం ఫ్రైడే. కథ విషయానికొస్తే.. ఒక రాజకీయ పార్టీ నేత అధికారం చెలాయిస్తుంటారు. ఆ పార్టీలో ఎంఎల్‌ఏ టిక్కెట్ కోసం ఇద్దరు రౌడీలు ప్రయత్నిస్తుంటారు. వారిద్దరూ గంజాయి, హార్బర్‌లో దందాలు అంటూ అరాచకం సృష్టిస్తారు. అందుకు అనుచరులను పెంచి పోషిస్తుంటారు. అలాంటి వారిలో జీవా అనే యువకుడు ఒక రౌడీకి ప్రధాన అనుచరుడిగా పని చేస్తుంటాడు. అతనికి భార్య సోదరుడు, అతనికి భార్య అంటూ కుటుంబం ఉంటుంది. అయితే అతను తన తమ్ముడిని తనలా కాకుండా చదివించి విదేశాలకు పంపించాలని ఆశ పడతాడు. ఆ తరువాత తను కూడా మంచిగా మారి సాధారణంగా జీవించాలని భావిస్తాడు. అయితే అది జరగడానికి ముందే తమ్ముడు హత్యకు గురౌతారు. ఆ తరువాత జరిగే విపరీత ఘటనలే ఫ్రైడే చిత్రం. ఒక మనిషి రౌడీగా మారడానికి కారణం ఏమిటి? కత్తి చేత పట్టిన వాళ్లు ఆ కత్తులకే బలి అవుతారు అనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రం ఇది. డక్డమ్ మోషన్ పిక్చర్స్ పతాకంపై అనీష్ మాసిలామణి నిర్మించిన ఈ చిత్రానికి హరి వెంకటేష్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇందులో అనీష్ మాసిలామణి, మైమ్ గోపి, దీనా, కలైయరసన్ ,రామచంద్ర దురైరాజ్,చిత్ర సేనన్, సిద్ధూ కుమరేశన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జానినాష్ ఛాయాగ్రహణం, డుమె సంగీతాన్ని అందించిన ఒక్క రాత్రిలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.


