విస్తృతంగా బ్యాంకింగ్ సేవలు
సాక్షి, చైన్నె : తమ ఉనికిని బలోపేతం చేయడం లక్ష్యంగా బ్యాంకింగ్ సేవలను విస్తృతం చేశామని కరూర్ వైశ్య బ్యాంక్ ఎండీ రమేష్‌బాబు తెలిపారు. తిరునల్వేలి జిల్లా మేలపాళయంలో ఏర్పాటు చేసిన కొత్త శాఖను గురువారం మునిసిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ డి చంద్ర మోహన్, ప్రసూతి వైద్యులు గాయత్రి శివరామకృష్ణన్‌లతో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ, అఖిల భారత స్థాయిలో తమ శాఖల నెట్ వర్క్ 898కి చేరినట్టు వివరించారు. కొత్త శాఖలు, కొత్త ఖాతాలు, డిపాజిట్లు, రుణాలు,పొదుపు, కరెంట్ ఖాతాలు , సమగ్ర బ్యాంకింగ్ సేవలు విస్తృతం చేశామన్నారు. కేవీబీ బలమైన డిజిటల్ పరిష్కారాలను కూడా అందిస్తున్నట్టు, కేవీబీ డిలైట్ మొబైల్ బ్యాకింగ్‌యాప్ 150కు పైగా ఫీచర్లతో ఆర్థిక , ఆర్థికేతర సేవలను అందిస్తున్నట్టు వివరించారు.


