క్యూ ఆర్ ఆధారితంగా సహాయక సేవలు
సాక్షి, చైన్నె: ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పై పోరాటంలో భాగంగా క్యూ ఆర్ కోడ్ ఆధారిత రోగి సహాయక సేవలకు జెమ్ ఆస్పత్రి శ్రీకారం చుట్టింది. బుధవారం జరిగిన క్యాన్సర్ అవగాహన మాసం కార్యక్రమంలో ఆస్పత్రిలో సకాలంలో వైద్యుల జోక్యం, క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగులకు మద్దతుగా సహకారం గురించి వివరించారు. అలాగే ప్రపథమగా క్యూ ఆర్ ఆధారితంగా రోగి సహాయక సేవలకు శ్రీకారం చుట్టారు. ప్రారంభ లక్షణాలు లేదా ఆందోళనలను ఎదుర్కొంటున్న వారికి మార్గదర్శకంగా ఈ సేవల అందుబాటులో ఉంటుందని జెమ్ వ్యవస్థాపకుడు డాక్టర్ సి పళణి వేలు తెలిపారు. క్యూ ఆర్ ఆధారిత రోగి యాక్సెస్ – ముందస్తు జోక్యం వైపుగా ఒక అడుగు అని, ఇదిప్రజలకు దోహదకరంగా ఉంటుందని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పి సెంథిల్ నాథన్ ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సీఈఓ డాక్టర్ ఎస్ అశోకన్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీవత్సవ్ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.


