ప్రజారక్షణే ప్రథమ కర్తవ్యం
గృహ లబ్ధిదారుకు తాళం అందజేస్తున్న సీఎం స్టాలిన్
‘ప్రజల ఆనందమే ప్రభుత్వానికి ముఖ్యం. వారి రక్షణే మా ప్రథమ కర్తవ్యం. ప్రజలను ఎలా రక్షించాలో తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునేందుకు అనేక కుట్రలు సాగుతున్నాయి. తీవ్ర నిరాశతో విరక్తి అంచునకు చేరిన నేతలు మాకు హితబోధ చేయాల్సిన అవసరం లేదు.’ అని సీఎం స్టాలిన్ అన్నారు. కల్ నీర్కుళం పంచాయతీలో విద్యార్థిని ప్రేమ కుటుంబం కోసం నిర్మిస్తున్న ఇంటి పనులను స్వయంగా పరిశీలించిన సీఎం, అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
సాక్షి, చైన్నె : ప్రజారక్షణే ద్రావిడ మోడల్ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని, తమకు ఇతరులెవరూ హిత బోధ చేయాల్సిన అవసరం లేదని సీఎం ఎంకే స్టాలి న్ వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి విరక్తి అంచున ఉంటూ అబద్ధాలను వల్లివేస్తున్నారని ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీఎం ఎంకే స్టాలిన్ బుధవారం తెన్కాసి జిల్లాలో పర్యటించారు.‘కలైంజ్ఞర్ డ్రీమ్‌హోమ్ ప్రా జెక్ట్’ కింద, కల్ నీర్కుళం పంచాయతీలో విద్యార్థిని ప్రేమ కుటుంబం కోసం నిర్మాణంలో ఉన్న ఇంటి పనులను సీఎం స్వయంగా పరిశీలించారు. చైన్నెలో జరిగిన విద్యావేడుకలో తమకు సొంతిల్లు కట్టించి, ఇవ్వాలని సీఎంను విద్యార్థి ప్రేమ అభ్యర్థించిన వి షయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ఇల్లు మంజూరు చేశారు. ఆ పనులను పరిశీలించారు. ప్రే మ తల్లి ముత్తులక్ష్మి, తండ్రి ఎస్ రామస్వామిని ప రామర్శించి వారితో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌కు పిల్లలు కర్ర సాము విన్యాసంతో ఆహ్వానించారు. అదే సమయంలో సీ ఎం సైతం కర్ర సాముతో అలరించారు. అనంతరం తెన్కాసిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం స్టాలిన్ హాజరయ్యారు. కలైంజ్ఞర్ డ్రీమ్ హోమ్ లక్షో లబ్ధిదారైన సెంగోట్టై సమీపంలోని లాతూరు గ్రా మానికి చెందిన ఎం సుమతికి ఇంటి తాళం అందజేశారు. ఇదే వేదికపై తెన్కాసి జిల్లాలో రూ.141 కోట్ల తో పూర్తి అయిన 117 పనులను సీఎం ప్రారంభించారు. రూ.291 కోట్లతో చేపట్టనున్న 83 కొత్త పనులకు శంకుస్థాపన చేశారు. రూ.582 కోట్లు విలువైన సంక్షేమ పథకాలను 2,44,461 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ప రిపాలన శాఖ మంత్రి కేఎన్ నెహ్రు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఐ పెరియస్వామి, రెవెన్యూ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్, ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పీ గీతా జీవన్, అటవీ శాఖ మంత్రి ఆర్‌ఎస్ రాజకన్నప్పన్, పాడి పరిశ్రమల శాఖ మంత్రి మనో తంగరాజన్, ఎంపీలు కనిమొళి, రాబర్డ్ బ్రూస్, రాణి శ్రీకుమార్, ఎమ్మెల్యేలు రాజా, అబ్దుల్ వహాబ్, సదన్ తిరుమలైకుమార్, పళని నాడార్, పంచాయతీరాజ్ శాఖ అ దనపు ముఖ్యకార్యదర్శి గగన్‌దీప్ సింగ్ బేడీ, తెన్కా సి జిల్లా కలెక్టర్ ఏకే కమల్ కిషోర్ హాజరయ్యారు.
పది కొత్త పనులు
నాలుగున్నర సంవత్సర కాలంలో తెన్కాసి జిల్లా ప్రగతికి చేసిన పనులను గుర్తు చేస్తూ , కొత్తగా పది వాగ్దానాలు సీఎం స్టాలిన్ ఇచ్చారు. కొత్తగా ఆవి ర్భవించిన తెన్కాసి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం కోసం రూ.15 కోట్లతో బ్రహ్మాండ భవనం నిర్మించనున్నామని ప్రకటించారు. శంకరన్‌కోయిల్ సమీపంలోని నల్లూరులో మహిళలకు మరింత ఉ పాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా గురుకల్ప ట్టి పారిశ్రామికవాడలో రూ. 52 కోట్లతో కొత్త తాగునీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నామని, ది వ్యాంగుల కోసం రూ. 2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నామని, కడయం పంచాయతీ యూనియన్‌కు రూ. 6 కోట్లతో కొత్త భవనం, శివగిరి, కడయనల్లూరు, శంకరన్‌కోవిల్, తిరువెంగడం సర్కిల్‌లోని రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి రూ.12 కోట్లతో ప్రాజెక్టు, రూ.4 కోట్లతో శివశైలం ఆనకట్ట పునరుద్ధరించనున్నామని తెలిపారు. అలాగే రూ. 4 కోట్లు వాటర్ ట్యాంక్‌ల అప్ గ్రేడ్, సెంగోట్టై సర్కిల్‌లోని అడవి నైనార్‌కోయిల్ రిజర్వాయర్ పరిసరాలలోని కాలువలు, చెరువులను రూ. 5 కోట్లతో అభివృద్ధి చేయడం, రూ. 2 కోట్లతో వీరకేరళంబుదూర్ తాలూకాలోని మరంతై కాలువ పునరుద్ధరణ, ఆలంకులంలో ప్రభుత్వ మహిళా కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రూ. ఒక కోటితో సౌకర్యాలు కల్పించనున్నామని ప్రకటించారు. ప్రజల ఆనందమే ప్రభుత్వానికి ముఖ్యం అని, ప్రజా రక్షణ కోసమే తొలి ప్రాధాన్యత అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
విద్యార్థి ప్రేమ కుటుంబ సభ్యులతో సీఎం స్టాలిన్, ఇంటి నిర్మాణ పనుల పరిశీలన
పిల్లలతో కలిసి కర్రసాము చేస్తున్న సీఎం స్టాలిన్
విరక్తి అంచున పళణి
ప్రతి పక్ష నాయకుడు పలణిస్వామి తీవ్ర నిరాశతో విరక్తి అంచునకు చేరి ఉన్నారని ఎద్దేవా చేశారు. తమిళనాడులో తాజాగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని వివరిస్తూ, ఈ వర్షాల రూపంలో ఎదురయ్యే విపత్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు అన్ని జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉన్నామన్నారు. అయితే, వీటిని అభినందించాల్సిన ప్రతిపక్ష నేత పని గట్టుకుని రాజకీయాలు చేస్తూ, విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఇటీవల కాలంగా ఆయన పూర్తిగా అబద్దా ల కోరుగా మారి ఉన్నారని ధ్వజమెత్తారు. నాలుగు సంవత్సరాలలో 42 లక్షల 61 వేల 386 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తాము కొనుగోలు చేస్తే, తప్పుడు లెక్కలతో వాటిని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పళణి స్వామి నుంచి అబబ్ధాలు, ద్రోహం తప్ప మరేమీ ఆశించలేమని పేర్కొంటూ, అవసరం అయితే, వరి సేకరణ గురించి గణాంకాలు పరిశీలించుకోవాలని హితవు పలికారు. తానూ రైతు బిడ్డ అని చంకలు గుద్దుకునే పళని స్వామి నిజంగానే చిత్తశుద్ధి అనేది ఉండి ఉంటే, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చినానంతరం మూడు ప్రకృతి వైపరీత్య విలయాలను ఎదుర్కొన్నామని గుర్తు చేస్తూ, ఈ సమయంలో తాము ఏ మేరకు చర్యలు తీసుకున్నామో అన్నది ప్రజలకే తెలుసని పేర్కొన్నారు. ప్రజలను ఎలా రక్షించాలో తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునేందుకు అనేక కుట్రలు సాగుతున్నాయని వివరిస్తూ, ఇందులో ఎస్‌ఐఆర్ కూడా ఉందన్నారు. తమిళనాట ఓటమి అన్నది బీజేపీ నిర్ధారించుకుందని, అందుకే కొత్త యుక్తులతో దొడ్డి దారి ప్రయత్నాలు చేస్తుందని మండి పడ్డారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నవంబర్ 2వ తేదిన జరిగే అఖిల పక్ష సమావేశానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
అక్కడ కాశి...ఇక్కడ తెన్కాసి
ఈ కార్యక్రమంలో సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ పశ్చిమ కనుమలలోని ప్రకృతి రమణీయతను నింపుకున్న తెన్కాసి ప్రత్యేకతలను గుర్తు చేశారు. ఉత్తరాన కాశీ ఉంటే, దక్షిణాన తెన్కాసి ఉందని, ఇక్కడ కొలువై ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం ఒక అద్భుతమైన ప్రదేశం అన్నారు. ఈ ఆలయానికి 19 ఏళ్ల తరువాత బ్రహ్మాండ వేడుకగా కుంభాభిషే కం నిర్వహించే అవకాశం ద్రావిడ మోడల్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. విద్యార్థిని ప్రేమ ఇంటికి వెళ్లి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇదే వేదికపై, లక్షో లబ్ధిదారైన సుమతి ముత్తుకుమార్‌కు ఇంటి తాళం అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి కుటుంబానికి సొంతిల్లు, గుడిసెల రహితంగా గ్రామాలను తీర్చిదిద్దే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయని తెలిపారు. ద్రావిడ మోడల్ పాలనలో అన్ని విధాలుగా, అన్ని రంగాలో తమిళనాడు ముందుకు దూసుకెళుతోందని పేర్కొన్నారు. అందరికీ అన్నీ అనే లక్ష్యంతో అన్ని జిల్లాల అభివృద్ధిపై తానే స్వయంగా దృష్టి సారిస్తూ వస్తున్నాయనని తెలిపారు.
ప్రజారక్షణే ప్రథమ కర్తవ్యం
ప్రజారక్షణే ప్రథమ కర్తవ్యం


