5న టీవీకే సర్వ సభ్య సమావేశం
విజయ్ లేఖ
సాక్షి, చైన్నె: నెల రోజుల తర్వాత తమిళగ వెట్రి కళ గం కార్యక్రమాలు మళ్లీ వేగం పుంజుకోనున్నాయి. నవంబర్ 5వ తేదీన మహాబలిపురం వేదికగా ప్రత్యేక సర్వ సభ్య సమావేశానికి ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ పిలుపు నిచ్చారు. టీవీకే విజయాన్ని ఎవరూ ఆపలేరని, తరలిరండి అని కేడర్‌కు లేఖాస్త్రం సందించారు. కరూర్ ఘటన తర్వాత నెల రోజులు విజయ్ పార్టీ కార్యక్రమాలు స్తంభించిన విషయం తెలిసిందే. బాధితులకు చైన్నెలో పరామర్శ, తదుపరి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు విజయ్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పార్టీ కోసం ప్రత్యేకంగా నియమించిన కోర్ కమిటీతో బుధవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం గురించి ఇందులో చర్చించి నిర్ణయాలు తీసుకున్నా రు. ఈ సమావేశానంతరం మీడియా తో ఆ పార్టీ సంయు క్త కార్యదర్శి నిర్మల్ కుమార్ మాట్లాడు తూ తొలి నిర్వాహ క కమిటీ సమావే శం జరిగిందని, ఇ ది పార్టీకి వెన్నెముక లాంటి కోర్ కమిటీ అని వ్యా ఖ్యానించారు. తదుపరి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం గురించి చర్చించామన్నారు. కరూ ర్ ఘటన జరిగిన సమయంలో తమ నిర్వాహకులను బలవంతంగా పోలీసులు బయటకు పంపించేశారని, తమ వాళ్లపై దాడి కూడా జరిగిందని, త మకు పోలీసుల ద్వారా ఇక న్యాయం లభించదని నిర్ధారించుకున్న తర్వాత కోర్టును ఆశ్రయించామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. విజయ్ కరూర్ పర్యటనకు అనుమతి దక్కలేదన్నారు. అనుమతుల కోసం ఎన్నో అడ్డంకులు సృష్టించారని, నాటకాలను రక్తి కట్టించారని విమర్శించారు. ఈ భేటీ తదుపరి విజయ్ కేడర్‌కు లేఖ రాశారు.
సర్వ సభ్యం భేటీ
కొంత రాజకీయ నిశబద్ధం తరువాత మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, మీతో మాట్లాడాలనుకుంటున్నా.. అని కేడర్‌కు విజయ్ ఆ లేఖలో పిలుపు నిచ్చారు. ఈనెల 5వ తేదీన మహాబలిపురం వేదికగా పది గంటలకు పార్టీ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగాయని, వాటిని చిన్నాభిన్నం చేశామని పేర్కొంటూ, పార్టీకి సైన్యం మీరే, తమిళనాడుకు ప్రజలే కవచం అని వ్యాఖ్యానించారు. టీవీకే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, నెల రోజుల మౌనం సాక్షి అని పేర్కొంటూ, తదుపరి అడుగులు జాగ్రత్తగా వేయాలని, చేపట్టాల్సిన పనుల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుందామని, ఇదే తన ఆహ్వానం అని పిలుపు నిచ్చారు.


