కష్ట పడితే ఉన్నత స్థానానికి.. | - | Sakshi
Sakshi News home page

కష్ట పడితే ఉన్నత స్థానానికి..

Oct 30 2025 9:00 AM | Updated on Oct 30 2025 9:00 AM

కష్ట

కష్ట పడితే ఉన్నత స్థానానికి..

– ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ వ్యాఖ్య

సాక్షి, చైన్నె : కష్టపడే ప్రయత్నం చేయకుండా ఉంటే ఎలా ఉన్నత స్థానానికి ఎదుగుతారని, అందుకే ప్రతి ఒక్కరూ కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం కోయంబత్తూరులో పర్యటించిన ఉప రాష్ట్రపతి, బుధవారం తిరుప్పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సీపీ రాధాకృష్ణన్‌కు సత్కార కార్యక్ర మం జరిగింది. ఇందులో ఆయన ప్రసంగిస్తూ, రాజకీయాల్లో హెచ్చుతగ్గులన్నవి ఉంటాయని, అయితే, దేవుని సంకల్పం భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటానని ఎన్నడూ అనుకోలేదని, అయితే రాజకీయాల్లో రాణించే అవకాశం తనకు దక్కిందన్నారు. ఈ ప్రయాణంలో ఎందరో తన భుజం తట్టి అభినందించారని గుర్తుచేశారు. రాజకీయాల్లో కష్టపడకుండా ఏదీ దరి చేరదని, కష్టపడితే ఉన్నత స్థానానికి చేరుకుంటారని అన్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని సత్యం, ధర్మం వైపుగా ప్రయాణం ఉండాలని, ఉన్నత స్థానానికి ఎదగాలన్న ఆలోచనతో శ్రమపై దృష్టి పెట్టి ముందడుగు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీపీ రాధాకృష్ణన్‌ను బీజేపీ తమిళనాడు కోఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పుష్పగుచ్ఛంతో సత్కరించారు. అనంతరం పలువురు ప్రముఖులు సీపీఆర్‌ను సత్కరించారు.

వికసిత్‌ భారత్‌ వైపు దేశం

సాక్షి, చైన్నె : 2047 వికసిత్‌ భారత్‌ వైపుగా దేశం దూసుకెళుతోందని వక్తలు వ్యాఖ్యానించారు. వినాయక మిషన్స్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ చైన్నె క్యాంపస్‌లో బుధవారం జరిగిన సదస్సులో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌, పద్మ విభూషణ్‌ డాక్టర్‌సీ రంగరాజన్‌ ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశ హోదాను సాధించడానికి డేటా ఆధారిత రోడ్‌ మ్యాప్‌ను రూపొందించారన్నారు. విద్య సంబంధిత అంశాలు, ఆర్థిక విద్యపై పాఠశాలల నిబద్ధతను గురించి వివరించారు. వికసిత్‌భారత్‌ ప్రయాణం, ిస్తిరత్వం, సమానత్వంతో వృద్ధిని గుర్తు చేశారు. వినాయక మిషన్స్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ విద్యా సంస్థ చాన్సలర్‌ డాక్టర్‌ ఏఎస్‌ గణేషన్‌ అధ్యక్షత ప్రసంగంలో విద్య ద్వారా జాతీయ అభివృద్ధికి విశ్వవిద్యాలయాల పాత్ర కీలకమన్నారు. విద్యాసంస్థ ఉపాఽధ్యక్షులు అనురాధాగణేశన్‌, బోర్డు ఆఫ్‌ మేనేజ్‌ మెంట్‌ సభ్యుడు సురేష్‌ శామ్యూల్‌, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈడీ అధికారుల ఎదుట నటుడు కృష్ణ

తమిళసినిమా: మాదక ద్రవ్యా ల వాడకం కేసు లో గత మే నెల లో సినీ నటుడు కృష్ణ, శ్రీకాంత్‌ ను చైన్నె మాద క ద్రవ్య నిరో ధక శాఖ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో 15 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన ఈ ఇద్దరు నటులు షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా సంచలనం కలిగించిన ఈ కేసుపై చైన్నెలోని ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మాదకద్రవ్యాలను వాడుతున్న వారి వివరాలను సేకరించే విషయంలో భాగంగా నటుడు శ్రీకాంత్‌, కృష్ణను విచారించదలచినన ఈడీ అధికారులు ఇటీవల వారిని నేరుగా ఈడీ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేశారు. దీంతో నటుడు కృష్ట బుధవారం ఉదయం చైన్నెలోని ఈడీ కార్యాలయానికి హాజర య్యారు. ఆయన్ని ఈడీ అదికారులు పలు కోణాల్లో విచారించినట్లు సమాచారం.

నిఘా నీడలో పసుంపొన్‌ !

సాక్షి, చైన్నె: రామనాథపురం జిల్లా కౌముది సమీపంలోని పసుంపొన్‌ గ్రామాన్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో అత్యధిక జనాభా కలిగిన ముక్కుళత్తూరు సామాజిక వర్గ ప్రజల ఆరాధ్యుడు పసుంపొన్‌ ముత్తు రామలింగదేవర్‌ గురుపూజోత్సవం ఇక్కడ జరుగుతోంది. గురువారం ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, సీఎం ఎంకే స్టాలిన్‌తోపాటు పలు రాజకీయపక్షాల నేతలు, పలు జిల్లాల నుంచి ఆ సామాజిక వర్గ ప్రజలు తరలి రానున్నారు. దీంతో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో 8 వేల మందితో ఇక్కడ భద్రత కల్పించారు.

కష్ట పడితే ఉన్నత స్థానానికి.. 
1
1/2

కష్ట పడితే ఉన్నత స్థానానికి..

కష్ట పడితే ఉన్నత స్థానానికి.. 
2
2/2

కష్ట పడితే ఉన్నత స్థానానికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement