మేధాశక్తిని పెంచేందుకే పోటీలు | - | Sakshi
Sakshi News home page

మేధాశక్తిని పెంచేందుకే పోటీలు

Oct 27 2025 8:36 AM | Updated on Oct 27 2025 8:36 AM

మేధాశక్తిని పెంచేందుకే పోటీలు

మేధాశక్తిని పెంచేందుకే పోటీలు

● విజయేంద్ర సరస్వతి స్వామి

వేలూరు: విద్యార్థుల మేధాశక్తిని పెంచేందుకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఓం సాయిరామ్‌ భగవాన్‌ శ్రీసత్యసాయిబాబా ట్రస్ట్‌, బాల వికాస్‌ జిల్లా ఆర్గనైజర్‌ సత్యనారాయణన్‌ తెలిపారు. వేలూరులోని వెంకటేశ్వర ప్రభుత్వ పాఠశాలలో బాల వికాస్‌ ఆధ్వర్యంలో పుట్టపర్తి సత్యసాయిబాబా 100 జయంతిని పురష్కరించుకొని వివిధ పోటీలు నిర్వహించారు. అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలకు వంద మందికి పైగా తల్లిదండ్రులు, 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. వేలూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కే.విమల్‌నాథన్‌, బాలవికాస్‌ మాజీ ఇన్‌చార్జ్‌ నటరాజన్‌, సత్యసాయి బాబా భక్తులు పాల్గొన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి

ఏటీఎం యంత్రంలో వినూత్న చోరీ

– నిందితుల కోసం గాలింపు

తిరువొత్తియూరు: పాత చాకలిపేట జి.ఎ.రోడ్డులో బ్యాంకు ఉంది. ఈ బ్యాంకు నియంత్రణలో ఆ ప్రాంతంలో సుమారు 12 ఏటీఎం యంత్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో రాయపురం సూర్యనారాయణన్‌ రోడ్డులోని యంత్రంలో గత సంవత్సరం ఏప్రిల్‌ నెల రూ.100, రూ.200 నోట్లకు బదులుగా రూ.500 వచ్చేలా సాంకేతికతను మార్చి పలు ఏటీఎం కార్డులను ఉపయోగించి రూ 4 లక్షల 12 వేలు నగదు వినూత్న పద్ధతిలో తీసుకున్నట్లు తెలిసింది. ఈ దృశ్యాలు అక్కడి నిఘా కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై బ్యాంకు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వినూత్న దోపిడీకి సంబంధించి బ్యాంకు యాజమాన్యం తరపున జార్జిటౌన్‌ 16వ క్రిమినల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో రాయపురం పోలీసులు కేసు నమోదు చేసి ఏటీఎం యంత్రంలో వినూత్న పద్ధతిలో డబ్బు దోచుకున్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి

తిరువొత్తియూరు: నీటి బకెట్‌లో పడి ఓ చిన్నారి మృతి చెందింది. వివరాలు.. చైన్నె తేనాంపేట జోగి తోటకు చెందిన దంపతులు శ్రీరామ్‌, సంతాన లక్ష్మి. వీరికి ఏడాదిన్నర వయసున్న ధనుష్‌ అనే బి డ్డ ఉన్నాడు. పక్క ఇంట్లో నివసిస్తున్న బంధువు అ లమేలుకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను చూడడానికి సంతాన లక్ష్మి బిడ్డతో కలిసి వెళ్లింది. అప్పుడు బిడ్డ ధనుష్‌ అలమేలు ఇంట్లో బాత్‌రూంలో ఉన్న నీటి బకెట్‌లో ప్రమాదవశాత్తూ పడి పోయాడు. దీంతో సంతాన లక్ష్మి తన బిడ్డను రక్షించి తేనాంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చింది. అయితే చికిత్స పొందుతూ బిడ్డ మృతి చెందడంతో తేనాంపేట పోలీసులు విచారణ చేస్తున్నారు.

కొరుక్కుపేట: మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతిస్వామి ఉద్భోదించారు. కందషష్ఠి పర్వదినాన్ని పురష్కరించుకుని శ్రీకంచి కామకోటి పీఠం తరఫున భారతదేశంతోపాటు వివిధ దేశాల్లో విద్యార్థులకు సహస్ర కుమార భోజనం శనివారం జరిగింది. ఇందులోభాగంగా చైన్నెలోని చేట్‌పేటలోని శంకరాలయంలో జరిగిన కుమార భోజనాన్ని కంచి కామకోటి పీఠాతి పతి శంకరవిజయేంద్ర సరస్వతిస్వామి ప్రారంభించి విద్యార్థులను ఆశీర్వదించారు. అనంతరం స్వామివారు మాట్లాడుతూ మన అవసరాలు, కోరికలకు అనుగుణంగా కాలం మారుతోందని, కొన్ని అవసరాలు సహజంగానే వస్తాయన్నారు. అదేవిధంగా, మనం తప్పించుకోవాల్సిన అనేక అవసరాలను వెతుక్కుంటూ ఉంటామని తెలిపారు. తరం నుంచి తరానికి అనుసరిస్తున్న అనేక పద్ధతులు ప్రస్తుతం మారుతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించి కాపాడుకోవాలన్నారు. మానవత్వం స్వేచ్ఛగా ఆలోచించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. సేవా స్ఫూర్తితో నిజాయితీపరులుగా మారాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా 68 ప్రదేశాల్లో జరిగిన ఈ సహస్ర కుమారభోజన్‌లో 1,600 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement