యథార్థ ఘటన చిత్రంగా ఐయామ్
ఐయామ్‌లో
బాలాజి, రైనాకరట్
తమిళసినిమా: యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించే కథా చిత్రాల్లో ఒక సోల్ ఉంటుంది. దాన్ని రక్తి కట్టించేలా తీస్తే ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాంటి కథాంశంతో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఐయామ్ అని ఆ చిత్ర దర్శకుడు ఎన్.వసంత్ పేర్కొన్నారు. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని సెంథిల్ ఆండవర్ మూవీస్ పతాకంపై ఈశ్వరన్ విజయన్ నిర్మిస్తున్నారు. నటుడు బోస్ వెంకట్, గానా ఉలగనాథన్ ఆడుగళం మురుగదాస్ ప్రధాన పాత్రలు పోషించారు. నటి దీపాశంకర్, కేపీవై.వినోద్, మిబ్బు రంజన్, విజయ్ గణేష్, క్రేన్ మనోహర్, యాజర్, సుబ్రమణి, డీఎన్‌ఏ.విజయలక్ష్మి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాలాజీ, రైనా కరట్ హీరోయిన్లుగా నటించారు. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొంటూ శ్రీలంక నుంచి జీవనాధారం కోసం మన దేశానికి వచ్చిన ఒక కుటుంబానికి ఎదురైన అవినీతి, అక్రమాలు, వాటిని వారు ఎదుర్కొన్నారు వంటి కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఐయామ్ అని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను బెంగళూరు, హొసూరు, తూత్తుక్కుడి, రామేశ్వరం, చైన్నె ప్రాంతాల్లో 40 రోజుల్లో పూర్తిచేసినట్లు చెప్పారు.


