బైసన్‌కు సీఎం ప్రశంసలు
తమిళసినిమా: మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటుడు ధ్రువ్‌విక్రమ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్. నటి అనుపమపరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి, దర్శకుడు అమీర్, లాల్, మదన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అప్లాస్ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్‌న్స్ పతాకంపై దర్శకుడు రంజిత్ నిర్మించారు. నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 17న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. బైసన్ చిత్రాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల తిలకించారు. అనంతరం మారిసెల్వరాజ్, ఽధ్రువ్‌విక్రమ్‌లను పిలిపించి అభినందించారు. బైసన్ చిత్రం గురించి ఎక్స్‌లో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ మారిసెల్వరాజ్ సినీమకుటంతో ఇది మరో వజ్రం. ఆయన తన ప్రతిభను మాత్రమే నమ్ముకుని సాధించడానికి వచ్చిన ఒక యువకుడు కబడ్డీ కోర్టులోనా బయట ఎదురైన పోరాటాలను ఎదుర్కొని విజయం సాధించిన కథను చాలా గొప్ప స్క్రీన్ అనుభవంగా మార్చారు. క్రీడలు నేపథ్యంగా చేసుకుని ఒక యువకుడు చేరుకోవాల్సిన మార్గాన్ని రాజకీయ పరిజ్ఞానంతో దర్శకుడు మారిసెల్వరాజ్ చూపించారు. ఆయన సినిమా భాషను, కళను మరింత మెరుగు పరిచేవిధంగా బైసన్ చిత్రం ప్రతిబింబిస్తోంది. ఈచిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి మారిసెల్వరాజ్ కథనానికి ప్రాణం పోసిన నటుడు ధ్రువ్‌విక్రమ్, పశుపతి, అనుపమపరమేశ్వరన్, రెజీషా విజయన్ నటినటులకు తెర వెనుక శ్రమించిన సాంకేతిక వర్గానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు . ముఖ్యమంత్రి స్టాలిన్‌కు దర్శకుడు మారిసెల్వరాజ్ తన ఎక్స్ మీడియా ద్వారా తన కృతజ్ఞతలు తెలిపారు.


