ఘనంగా స్నాతకోత్సవం
కొరుక్కుపేట: చైన్నె కొట్టూరుపురంలోని అన్నా సెంటెనరీ ఆడిటోరియం వేదికగా టీమ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ 21వ స్నాతకోత్సవవ శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, రాయపురం రిటైర్డ్ హెచ్‌ఎం అమలదాస్ విచ్చేశారు. వీరు పట్టభద్రులకు 570 మంది విద్యార్థులకు డిప్లొమా సర్టిఫికెట్‌లను ప్రదానం చేశారు. టీమ్ విద్యా సంస్థ సహ వ్యవస్థాపకులు ఫెలిక్స్ మైఖేల్ టీమ్ విద్యాసంస్థ అన్నా స్టెఫీ అధ్యక్షతన జరిగిన ఈ స్నాతకోత్సవంలో వారు గ్రాడ్యుయేట్లను అభినందించారు.


