ప్రపంచ దేశాలకు తమిళనాడు ఉత్పత్తులు
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఉత్పత్తి అయ్యే సంప్రదాయ, ప్రత్యేకమైన వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేసే దిశగా ప్రపంచ తమిళుల కోసం వాణిజ్య ఉత్సవం జరగనుంది. ఇందుకోసం చైన్నె నుంచి 55 మంది వ్యవస్థాపకులను మలేషియా పర్యటన నిమిత్తం తమిళనాడు నుంచి ఎంపిక చేశారు. ఈ వివరాలను చైన్నె ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో మిల్లెట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుందర్, తమిళర్ వర్తక సంఘం అధ్యక్షుడు బాలకృష్ణన్‌లు ప్రకటించారు. తమిళనాడు నుంచి 55 మంది వ్యవస్థాపకులను ఎంపిక చేశామని, ఇందులో చైన్నెకు చెందిన వారే అధికంగా ఉన్నట్టు వివరించారు. ఇంటర్నేషనల్ తమిళర్ బిజినెస్ కాన్ల్కేవ్ 2025 మలేషియా వేదికగా డిసెంబరు 22 నుంచి 25వ తేది వరకు జరగనున్నట్టు తెలిపారు. ఇందుకోసం 1000 మంది ప్రతినిధులను ఆహ్వానించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో తమిళనాడులో ప్రత్యేకమై, సాంపద్రాయక ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా సువర్ణావకాశాన్ని కల్పించేందుకు నిర్ణయించామని తెలిపారు. ఇక్కడి ఉత్పత్తులను, ఆహారం, తదితర వస్తువులను వివిధ దేశాల ముంగిటకు తీసుకెళ్లే విధంగా తమిళనాడు నుంచి 55 మందిని ఎంపిక చేశామని, ఇందులో చైన్నె నుంచి 22 మంది వ్యవస్థాపకులను ప్రతినిధులుగా ఉన్నట్టు వివరించారు.


