
వరుణాగ్రహం..!
విస్తృతంగా ముందస్తు జాగ్రత్తలు రిజర్వాయర్‌లలోకి పెరిగిన నీటి రాక ఇళ్లు కూలి ఇద్దరు మృతి చైన్నెకు తాత్కాలికంగా తప్పిన ముప్పు
ఈశాన్య రుతు పవనాలకు తోడు బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాలో వాన జోరు ఊపందుకుంది. 11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. చైన్నెకు తాత్కాలికంగా పెను గండం తప్పినా, వానలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రిజర్వాయర్‌లలో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాల ప్రవేశంలో ఓ వైపు అరేబియా సముద్రంలో ఓ అల్పపీడనం, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. అరేబియాలోని ద్రోణి రూపంలో కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి, తేని, నీలగిరి తదితర పశ్చిమ కనుమలలోని జిల్లాలో వర్షాలు విస్తారంగా వర్షాలు పడుతూ వస్తున్నాయి.
అదే సమయంలో బంగాళాఖాతంలోని ద్రోణి రూపంలో అతి భారీ వర్షాలు చైన్నె, శివారులలో కురిసే అవకాశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. చైన్నె, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి, నాగపట్నం, మైలాడుతురై, తిరుప్పూర్, ఈరోడ్, తిరుపత్తూరు, వేలూరు తదితర జిల్లాలతోపాటూ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బుధవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ జిల్లాలో రాత్రాంతా తేలక పాటిగా కొన్ని చోట్ల, మోస్తారుగా మరికొన్ని చోట్ల వర్షం పడింది. భారీ వర్షంతో విల్లుపురం కొత్త బస్టాండ్ జలదిగ్భందంలో చిక్కగా, కొన్ని గంటలలో అధికార యంత్రాంగం నీటిని తరలించి యథా స్థానానికి బస్టాండ్‌ను తీసుకొచ్చారు. చైన్నె శివారులలోని తిరుముల్‌లై వాయిల్, వానగరం, కాశిమేడు, గుడువాంజేరి, తదితర ప్రాంతాలలో భారీగా వర్షం పడింది. అయితే ఈశాన్య రుతు పవనాలు మరింతగా విస్తరించడంతో కోయంబత్తూరు, ఈరోడ్, నీలగిరిలలో అనేక చోట్ల వర్షాలు కొనసాగుతున్నాయి. ధర్మపురి, కృష్ణగిరి, సేలం జిల్లాలకు పవనాలు విస్తరించి కొన్ని చోట్ల భారీ వర్షాన్ని కురిపించడంతో వాగులు, వంకలలో నీటిక రాక పెరిగింది.
చిదంబరం బస్టాండ్ జలమయం
11 జిల్లాల్లో భారీ వర్షాలు