
శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం
– సొంత ఊర్ల నుంచి తిరిగి వచ్చేవారికి అవస్థలు
చైన్నె శివారు ప్రాంతాల్లో నిరంతర వర్షాల కారణంగా, సెలవులు ముగించుకుని తమ స్వస్థలాల నుంచి తిరిగి వస్తున్న ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివరాలు.. చైన్నె శివారు ప్రాంతాలైన తాంబరం, క్రోమ్‌పేట్, పల్లావరం, సైలెయూర్, వండలూర్, ఊరపాక్కం, పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కొనసాగింది. ఫలితంగా, బుధవారం తాంబరం–వేలచ్చేరి రోడ్డు, తాంబరం–ముడిచూర్ రోడ్డు, జీఎస్‌టీ రోడ్డులోని లోతట్టు ప్రాంతాలలో మోకాలి లోతు వరకు వర్షపు నీరు పేరుకుపోయింది. ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను నడపలేక, వాటిని నెట్టుకొని తీసుకు పోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా తూర్పు, పశ్చిమ తాంబరంలను కలిపే రైల్వే సొరంగం వంతెన ప్రాంతంలోవర్షపు నీరు నిలిచిపోయింది. తరువాత, కార్పొరేషన్ ఉద్యోగులు వర్షపు నీటిని వెంటనే తొలగించారు. తాంబరం , పరిసర ప్రాంతాలలోని ప్రధాన రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. తాంబరం, పల్లవరం సహా అనేక ప్రాంతాలలో రోడ్లపై వివిధ ప్రదేశాలలో వర్షపు నీరు నిలిచిపోయింది. టీటీకే నగర్, పెరుంగళత్తూర్ రోడ్, ముడిచూర్ రోడ్, సీడీవో కాలనీ, చిట్లపాక్కం, రాధా నగర్, క్రోంపేట్ నీరు ఏరులైపారింది. దీని కారణంగా ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను నడపలేక రోడ్డుపై ప్రయాణించాల్సి వచ్చింది. నిరంతర సెలవుల తర్వాత, జీఎస్టీ రోడ్డు ద్వారా తమ స్వస్థలాల నుంచి చైన్నెకి తిరిగి వస్తున్న ప్రజలు వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుని చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది.
తిరువొత్తియూరులోని శ్రీనివాసనగర్ లోతట్టు ప్రాంతాల్లో..
పురసైవాక్కంలో జలమయమైన రోడ్లు
విల్లుపురం బస్టాండ్‌లో భారీగా చేరిన నీరు
అల్పపీడనం కారణంగా పట్టినపాక్కం సముద్రంలో నురుగుగా వస్తున్న నీరు, కోడంబాక్కం ట్రస్టుపురంలోని కూలిన చెట్టు, చిదంబరం ఆలయం వద్ద నిండిన కోనేరు , ఈరోడ్ కలెక్టరేట్‌ను ముంచెత్తిన వరదనీరు
సేలం: ఈరోడ్ సత్యమంగలం వళ్లియమ్మన్ ఆలయం వద్ద కూలిన కొండచరియలు, ఈరోడ్ సత్యమంగళం అటవీ మార్గంలో వరద నీరు
హొగెనికల్ వద్ద నీటి ఉధృతి

శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం

శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం

శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం

శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం

శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం

శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం

శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం

శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం

శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం

శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం

శివారు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం