
సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు ఇద్దరు ఏడీజీపీలు
సాక్షి, చైన్నె: కరూర్ ఘటన సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ఇద్దరు ఏడీజీపీలు నియమితులయ్యారు. ఈ ఇద్దరు ఉత్తరాదికి చెందిన అధికారులు కావడం గమనార్హం. గత నెల 27వ తేదీన కరూర్‌లో టీవీకే నేత విజయ్ ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో 41 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. ఈ కేసును మద్రాసు హైకోర్టు ఆదేశాలతో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ బృందం తొలుత విచారించింది. ఆ తదుపరి కేసు సీబీఐకు చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారని, ఇందులో ఇద్దరు తమిళనాడు కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారులుగా ప్రకటించారు. తాజాగా కేసును గుజరాత్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో ఎడీఎస్పీ ముఖేష్‌కుమార్, డీఎస్పీరామకృష్ణన్‌తో సహా ఆరుగురితో కూడిన సీబీఐ బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తు పర్యవేక్షణ కమిటీలో తాజాగా ఇద్దరు అదనపు డీజీపీ స్థాయి అధికారులను నియమించారు. ఇందులో ఒకరు బిహార్‌లో పనిచేస్తున్న తమిళనాడు కేడర్‌కు చెందిన అదనపు డీజీపీ సుమీత్ శరణ్ కాగా, మరొకరు చత్తీస్‌గడ్‌లో పనిచేస్తున్న సోనాల్ మిశ్రా ఉన్నారు. సుమీత్‌శరణ్ ఇది వరకు కోయంబత్తూరు పనిచేసి, బీఎస్‌ఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సోనాల్ మిశ్రా 2000 సంవత్సరం ఐపీఎస్ కేడర్ అధికారి కావడం గమనార్హం.
ఫెస్టివల్ సీజన్‌లో
రికార్డుల బద్దలు
ఎమ్మెల్యే అరుల్‌ను అడ్డగించిన అన్బుమణి అనుచరులు
సాక్షి, చైన్నె: పీఎంకే ఎమ్మెల్యే అరుల్‌ను అన్బుమణి మద్దతుదారులు ముట్టడించడం వివాదానికి దారి తీసింది. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మద్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఎమ్మెల్యేలు జీకేమణి, అరుల్ రాందాసుకు మద్దతుగానూ, మరో ముగ్గురు అన్బుమణికి మద్దతుగానూ వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో ఎమ్మెల్యే అరుల్‌ను టార్గెట్ చేసి అన్బుమణి మద్దతు దారులు బుధవారం కయ్యానికి కాలు దువ్వారు. ఆయన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ధైర్యం ఉంటే గెలవాలంటూ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఇరు వర్గాల మధ్య వివాదం రేగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే అరుల్ ఆత్తూరు డీఎస్పీ సత్యరాజ్‌కు ఫిర్యాదు చేశారు.
తిరుత్తణిలో స్కందషష్టి
ఉత్సవాలు ప్రారంభం
– మురుగన్‌కు లక్షార్చన
తిరుత్తణి: తిరుత్తణి మురుగన్ ఆలయంలో స్కందషష్టి వేడుకలు బుధవారం షణ్ముఖర్‌కు లక్షార్చనతో ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో ప్రధానమైన పుష్పార్చన 27న నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేకువజామున మూలవర్లకు అభిషేక పూజలు నిర్వహించి బంగారు కవచంతో అలంకరించారు. అలాగే కావడి మండపంలో శ్రీవళ్లి, దేవసేన సమేత షణ్ముఖర్‌కు వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకచించారు. భక్తులు సమక్షంలో షణ్ముఖర్‌కు బిల్వ ఆకులతో లక్షార్చనతో అర్చకులు స్కందషష్టి వేడుకలకు శ్రీకారం చుట్టారు. పెద్ద సంఖ్యలో మురుగన్‌భక్తులు షష్టి మాలధారణ చేసి దీక్షలు చేపట్టి స్వామిని దర్శించుకున్నారు. ఏడు రోజుల పాటూ నిర్వహించనున్న వేడుకలు సందర్భంగా ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు షణ్ముఖర్‌కు లక్షార్చన నిర్వహిస్తారు. చివరి రోజైన 7 వ రోజు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. షట్టి ప్రారంభ వేడుకల్లో ఆలయ చైర్మన్ శ్రీధరన్, జాయింట్ కమిషనర్ రమణి, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు ఇద్దరు ఏడీజీపీలు