
దెబ్బతిన్న పంటలు
లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరడంతో రెస్క్యూ విస్తృతం చేశారు. అనేక చోట్ల చెరువుల నుంచి ముందు జాగ్రత్తగా నీటి విడుదలు చర్యలు తీసుకున్నారు. తంజావూరు, తిరువారూర్‌లలో భారీ వర్షం దాటికి లక్ష ఎకరాలలో వరి పంట దెబ్బ తినే పరిస్థితి నెలకొంది. వరి చేలలోకి నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తంజావూరు, తిరువారూర్‌లో నీట మునిగిన పంట పొలాలను అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళణి స్వామి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వారి ఆవేదనను, ఆందోళనను విన్నారు. మీడియాతో ఆయనమాట్లాడుతూ ఈ దీపావళి రైతులకు కన్నీటి పండుగ అని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి అంది వచ్చే సమయంలో నీళ్ల పాలు అయ్యాయని, కోత తదుపరి కొనుగోలు కేంద్రాలకు తరలించిన వరి వర్షార్పణం అయ్యాయని, ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని ధ్వజమెత్తారు. కడలూరులో వర్షందాటికి ఇళ్లు కూలడంతో ఇద్దరుమహిళలుమరణించారు. ఇక బుధవారం మధ్యాహ్నం తర్వాత చైన్నె, శివారులలో కాస్త వరుణుడు తెరపించినట్టుగా చిరు జల్లులు కురిసినా, ఆకాశం నల్లటి మేఘావృతంతో నిండింది.

దెబ్బతిన్న పంటలు