
తిరుత్తణి ఆలయంలో రద్దీ సాధారణం
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉండడంతో భక్తులు అతి తక్కువ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. పెరటాసి నెల ముగియడంతోపాటు దీపా వళి పండుగకు ముందు ఆదివారం తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొండ ఆలయంలో తక్కువ సంఖ్యలో భక్తులు చేరుకుని పది నిమిషాల వ్యవధిలో స్వామిని దర్శించుకున్నారు. నిత్యం రద్దీగా ఉంటూ గంట నుంచి రెండు గంటలపాటు వేచివుండి స్వామిని దర్శించకోవడం పరిపాటి. అయితే పెరటాసి నెల సందర్భంగా దీక్షలు చేపట్టి మాంసాహారం వీడిన భక్తులు వెంకటేశ్వర స్వామి మాలధారణ చేశారు. పెరటాసి ముగియడంతో దీక్ష విరమణ చేసిన జనం దీపావళికి ముందు రోజుతోపాటు ఆదివారం కావడంతో మాంసాహారం రుచి చూపేందుకు ఆసక్తి చూపారు. అలాగే దీపావళి పండుగ బిజీలో ఉన్న జనం కొండకు వెళ్లి స్వామి దర్శనానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో కొండ ఆలయంలో స్వామి దర్శనానికి తక్కువ సంఖ్యలో జనం వచ్చారు. అతి తక్కువ సమయంలో స్వామి ని దర్శించుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు.

తిరుత్తణి ఆలయంలో రద్దీ సాధారణం