
రేపు తుమ్మలగుంటలో నరకాసుర వధ
తిరుపతి రూరల్: దీపావళి వేడుకల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం సోమవారం తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద నరకాసుర వధ నిర్వహించనున్నారు. ఇందుకోసం రూ.2లక్షల వ్యయంతో 20 అడుగుల నరకాసుర ప్రతిమను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ సోమ వారం సాయంత్రం 5.30 గంటలకు నరకాసుర వధ కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రతిమకు బాణసంచా అమర్చిన నేపథ్యంలో ఎవరికీ అపాయం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయా లని ఆలయ అధికారులు, సిబ్బందికి సూచించారు.