
తమిళనాడు
Tamilnadu
7
2 గంటల నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కొరుక్కుపేట: తమిళనాడు వ్యాప్తంగా నిషేధిత బాణసంచా పేల్చివేస్తే 6 నెలల జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. ఈక్రమంలో ఎవరైనా టపాసులు పేల్చడానికి నిర్దేశించిన సమయ పరిమితిని ఉల్లంఘిస్తున్నారా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక 2018లో దీపావళి పండుగ సందర్భంగా 2 గంటలు మాత్రమే టపాకాయలు కాల్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. దీని ప్రకారం, తమిళనాడు ప్రభుత్వం ఏటా తమిళనాడులో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే పటాకులు కాల్చాలని ప్రకటిస్తోంది. ఈ సంవత్సరానికి కూడా ఈ ప్రకటన వెలువడింది. దీనికి సక్రమంగా అమలు పరిచేందుకు తమిళనాడు అంతటా ప్రత్యేక దళాలను మోహరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయనున్నారు.
సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
247