
గవర్నర్ ఆదేశాలకు చెక్
సాక్షి, చైన్నె: మాజీ వీసీ వేల్ రాజ్ సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలకు అన్నావర్సిటీ సిండికేట్ సమావేశం చెక్ పెట్టింది. ఆయన ఆదేశాలు చె ల్లదు అని స్పష్టం చేస్తూ తీర్మానం చేశారు. అన్నావర్సిటీ గురించి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు అన్నీ ఈ వర్సిటీ పరిఽధిలోనే ఉ న్నాయి. 2019లో ఈ వర్సిటీకి వీసీగా వేల్‌రాజ్ నియమితులయ్యారు. 2024లో ఆయన పదవీ కాలం ము గిసింది. ఈ సమయంలో ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతుల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన ట్టు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం విచారణలో ఉంది. అలాగే, కోర్టుకు సైతం చేరింది. పదవీ కాలం ముగిసినా, తనకు రిటైర్ మెంట్ వయస్సు రా ని దృష్ట్యా, ఆయన ఆవర్సిటీలో ప్రొఫెసర్‌గా కొనసాగుతూ వచ్చారు. పదవీ విరమణ రోజు జూలై 31వ తేదీ కావడం, అదే రోజున ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిని వ్యతిరేకిస్తూ ఆయన గవర్నర్ వద్ద అప్పీలుకు వెళ్లారు. దీంతో ఆయన సస్పెండ్ ఉత్తర్వులను గవర్నర్ రద్దు చేస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిస్థితులలో తాజాగా జరిగిన అన్నావర్సిటీ సిండికేట్ సమావేశంలో గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్మానం చేశారు. అలాగే అవినీతి విచారణ చేపట్టే విధంగా ఏసీబీకి సిఫారసు చేశారు. రిజిస్టార్‌తో పాటూ 11 మందిని అవినీతి జాబితాలో చేర్చి, వారి వివరాలను ప్రభుత్వానికి సిండికేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పంపించారు.