
భూగర్భ డ్రైనేజీ పనులు వేగవంతం
వేలూరు: కార్పొరేషన్ పరిధిలోని భూగర్భ డ్రైనేజి పనులను వేగవంతం చేయాలని కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. శుక్రవారం ఉదయం వేలూరు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మేయర్ సుజాత అధ్యక్షతన జరిగింది. ముందుగా కార్పొరేటర్లకు తీర్మానాలకు సంబంధించిన పుస్తకాన్ని అందజేశారు. అందులో గత సంవత్సరం కార్పొరేషన్ పరిధిలోని ఒకటో జోన్‌కు సక్రమంగా నిధులు కేటాయించక పోవడంతో పాటు నిధులు కేటాయించినట్లు చిత్ర పటాలను ముద్రించారని కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. దీంతో కమిషనర్ లక్ష్మణన్ వీటిపై విచారణ జరిపి, న్యాయం చేస్తామన్నారు. మరో కార్పొరేటర్ మాట్లాడుతూ తమ వార్డులో ఎటువంటి పనులు జరగకుండానే పనులు జరిగినట్లు, నిధులు కేటాయించినట్లు ప్రకటించారని వీటిపై అధికారులు నేరుగా విచారణ జరపాలన్నారు. 46వ వార్డు కార్పొరేటర్ మాట్లాడుతూ తమ వార్డులోని అమ్మనాగుంట ప్రాంతంలో దహనవాటిక ఏర్పాటు చేయడంతో పాటు వర్షపు నీరు నిలవకుండా చూడాలన్నారు. వీటికి మేయర్ సమాధానం ఇస్తూ ఇప్పటికే అధికారుల బృందం తనఖీ చేసిందని, వెంటనే పనులను ప్రారంభించి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణన్ తదితరులు పాల్గొన్నారు.

భూగర్భ డ్రైనేజీ పనులు వేగవంతం