క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Sep 27 2025 4:47 AM | Updated on Sep 27 2025 4:47 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

ప్రైవేటు కంపెనీల

మోసంపై ఫిర్యాదు

అన్నానగర్‌: చైన్నెలోని బెసెంట్‌ నగర్‌ నివాసి సుబ్రహ్మణ్యం(52) కుటుంబంతో హాంకాంగ్‌లో ఉంటూ అక్కడ ఒక ప్రైవేట్‌ కంపెనీలో అధికారిగా పనిచేస్తున్నాడు. ఆవడి పోలీస్‌ కమిషనర్‌ కార్యా లయం సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌కు దాఖలు చేసిన ఫిర్యాదులో ఆయన ఇలా తెలిపాడు. గత 3 నెల ల్లో తమ కంపెనీ నుండి దాదాపు రూ.15 కోట్ల విలువైన 2,296 టన్నుల రెసిన్‌ ముడి పదార్థాలను 90 కంటైనర్లలో చైన్నెలోని 2 కంపెనీలకు ఓడ ద్వారా పంపించినట్టు తెలిపారు. వాటిని కాట్టుపల్లి పోర్టులోని ఒక ప్రైవేట్‌ కంపెనీ ద్వారా ఆ కంపెనీలకు పంపించామని పేర్కొన్నారు. కానీ ఆ కంపెనీ యజమానులు ముడి పదార్థాలను స్వీకరించారు. వాటికి డబ్బు చెల్లించలేదు. తద్వా రా నమ్మక ద్రోహానికి పాల్పడినట్టు వారిపై చర్య లు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఆవడి సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

4వ రైల్వే లైన్‌ సర్వే

పనులు పూర్తి

కొరుక్కుపేట: తాంబరం–చెంగల్పట్టు 4వ రైల్వే లైన్‌ సర్వే పనులు పూర్తయ్యాయి. 31 కిలోమీటర్లు మేర రూ.713 కోట్లతో పనులు చేపట్టాలని యోచిస్తోంది. ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతున్నందున, అదనపు రైళ్లను నడపాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత రైల్వే లైన్లలో అదనపు రైళ్లను నడుపుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌, ఎలక్ట్రిక్‌ రైళ్లకు వేర్వేరు ట్రాక్‌లు ఉంటే, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వేగంగా, ఆలస్యం లేకుండా నడపగలరు. బీచ్‌ స్టేషన్‌ నుండి చెంగల్పట్టు వరకు ఎలక్ట్రిక్‌ రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, అదనపు సర్వీసును పెంచడం సాధ్యం కాదు. దీని కారణంగా, జీఎస్టీ రోడ్డుపై రద్దీ పెరుగుతుంది. అందుకే తాంబరం–చెంగల్పట్టు మధ్య 4వ రైల్వే లైన్‌ ప్లాన్‌ చేసి నిర్మించడానికి ఒక అధ్యయనం జరిగింది. దీని ద్వారా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రత్యేక రైల్వే లైన్‌, సబర్బన్‌ ఎలక్ట్రిక్‌ రైళ్లకు ప్రత్యేక రైల్వే లైన్‌ నిర్మించాలని నిర్ణయించారు. 31 కి.మీ. దూరానికి రూ.713.4 కోట్లతో 4వ రైల్వే లైన్‌ నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు పూర్త య్యాయి. సర్వే నివేదికను రైల్వేస్‌ ప్రాజెక్ట్‌ మూల్యాంకన కమిటీ ఆమోదం కోసం పంపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని అంచనా వేశారు. చాలా ప్రాంతాలకు భూసేకరణ అవసరం అవుతుంది. బోర్డు ఆమోదం పొందిన తర్వాత పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

27 రైల్వే స్టేషన్లలో

రూ.20కే భోజనం

కొరుక్కుపేట: భారతీయ రైల్వే రైలు ప్రయాణికుల కు వివిధ ప్రాథమిక సౌకర్యాలను అందిస్తోంది. ఒక స్టేషన్‌, ఒక ఉత్పత్తి అనే లక్ష్యంతో స్థానిక ఉత్పత్తులను ప్రధాన రైల్వే స్టేషన్లలో విక్రయిస్తున్నారు. ఇది ప్రయాణికుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే రైలు ప్రయాణికులకు నాణ్యమైన తాగునీరు, ఆహారాన్ని అందించడానికి రైల్వే లు కట్టుబడి ఉన్నాయి. రైల్వే స్టేషన్లలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం తక్కువ ధరలకు అమ్ముతారు. రిజర్వేషన్లు లేకుండా ప్రస్తుతం పబ్లిక్‌ కోచ్‌ల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సౌలభ్యం కోసం, దక్షి ణ రైల్వే రూ.20కి జనతా గణ అనే తక్కువ ధర భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది రిజర్వ్‌ చే యని కోచ్‌ల్లో ప్రయాణించే ప్రయాణికులకు అందుబాటులో ఉంది. ఈ విషయంలో చైన్నె డివిజన్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ ఏలుమలై మాట్లాడుతూ వన్‌ స్టేషన్‌ వన్‌ మీల్‌ స్కీమ్‌ విజయవంతంగా అ మలులోకి వచ్చిన నేపథ్యంలో, దక్షిణ రైల్వే తక్కు వ ధరకే భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జనరల్‌ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే ప్రయాణి కులకు రూ.20కి భోజనం అమ్ముతామన్నారు.సెంట్రల్‌, ఎగ్మోర్‌, తాంబరం, చెంగల్పట్టు, అరక్కోణం, కాట్పాడితో సహా 27 రైల్వే స్టేషన్లలో ఈ సరసమైన భోజనం లభిస్తుందన్నారు. ఈ ఆహారాన్ని పరిశుభ్రమైన పద్ధతిలో తయారు చేసి విక్రయిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఒక స్టేషన్‌, ఒక సరుకుల స్టాల్‌లో బాటిళ్లలో తాగునీరు అమ్ముతున్నారని చెప్పారు. దక్షిణ రైల్వేలోని 62 స్టేషన్లలో 84 స్టాళ్లను ఏర్పాటు చేశారని చెప్పారు.

మహాలక్ష్మిగా కొళ్లాపురమ్మ

పళ్లిపట్టు: నవరాత్రి ఉత్సవ వేడుకల్లో భాగంగా ఐదో రోజైన శుక్రవారం కొళ్లాపురమ్మ మహాలక్ష్మీదేవి అలంకరణలో కనువిందు చేశారు. పళ్లిపట్టు గ్రామదేవత కొళ్లాపురమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవ వేడుకలు సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. ప్రతిరోజూ అమ్మవారికి విశేష అభిషేక పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం సమయాల్లో అమ్మవారు ప్రత్యేక వాహనాలపై కొలువుదీరి పట్టణ వీధుల్లో ఊరేగుతున్నారు. ఐదవ రోజు వేడుకల్లో భాగంగా కొళ్లాపురమ్మ మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. మహాదీపారాధన పూజలు చేపట్టారు.

కుమరిలో జోరు వాన

సాక్షి, చైన్నె: కేరళ సరిహద్దులతోని తమిళనాడు ప్రాంతాలైన కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశిలలో మోస్తరు నుంచి భారీగా వర్షం కురుస్తోంది. కన్యాకుమారిలో కురుస్తున్న వర్షాలకు గోదై యారు పొంగింది. దీంతో తిరుప్పరపు జలాశయం పరిసరాలలోకి సందర్శకులను నిషేధించారు. పశ్చిమ కనుమల్లోని పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో తామర భరణి, మంజలారు, సేర్వలారులలోకి నీటి రాక పెరిగింది. తెన్‌కాశిలోని కుట్రాలం జల పాతంలో నీటి ఉధృతి పెరగడంతో స్నానాలపై నిషేధం విధించారు. 2 వతేదీ వరకు కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశిలో వర్షాలు కొనసాగనున్నాయి. శని, ఆదివారాల్లో కోయంబత్తూరు, తేని, నీలగిరులలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement