
నకిలీ డాక్టర్ అరెస్టు
పళ్లిపట్టు: ఎంబీబీఎస్ డాక్టర్ పేరును వినియోగించుకుని వైద్య సేవలు అందించిన నకిలీ డాక్టర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆంధ్రప్రదే శ్‌కు సరిహద్దులోని పళ్లిపట్టులో నకిలీ డాక్టర్లు కొంత మంది క్లినిక్ నడుపుతూ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యా దులందాయి. జిల్లా ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్ట ర్ అంబిక, మండల వైద్యాధికారి డాక్టర్ ధనంజయన్ తన బృందంతో పళ్లిపట్టులో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఇండియన్ బ్యాంకు శాఖ సమీపంలో వడివేలు క్లినిక్ పేరిట అనూష ఎంబీబీఎస్ బోర్డు ఉంచి, వడివేలు అనే వ్యక్తి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తిని అక్కడున్న మందులు, మాత్రలను స్వాధీనం చేసుకుని, పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ రమేష్‌కుమార్ కేసు నమో దు చేసి, విచారణలో పెరుమానళ్లూరు గ్రామానికి చెందిన వడివేలు పదో తరగతి వరకు మాత్రమే చదువుకుని, అలోపతి వైద్యం చేసేందుకు వీలుగా ఎంజీబీఎస్ చదువుకున్న డాక్టర్ పేరును వినియోగించుకున్నట్లు గుర్తించారు. గతంలో రెండు సార్లు నకిలీ డాక్టర్ వడివేలును పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. అదే సమయంలో బజారు వీధిలో ధన్వంత్రి క్లినిక్ పేరిట వైద్య సేవలు చేసిన మోహన్‌కుమార్ అనే వ్యక్తి ఆరోగ్యశాఖ అధికారుల తనిఖీ చేస్తున్నట్లు తెలుసుకుని అక్కడ నుంచి పరారయ్యాడు.