
నటీనటుల గురించి అసత్యాలు మాట్లాడితే..
తమిళసినిమా: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) 69వ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం ఉదయం స్థానిక తేనాంపేటలోని కామరాజర్ ప్రాంగణంలో నిర్వహించారు. 950 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్ , కోశాధికారి కార్తి , ఉపాధ్యక్షులు పూచి మురుగన్, కరుణాస్ నిర్వహణ పనులను పర్యవేక్షించారు. ముందుగా సంఘం సభ్యులకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం ఇటీవల కన్నుమూసిన నటి సరోజా దేవి ఢిల్లీ గణేష్ మనోజ్ రోబో శంకర్ తదితర 70 మంది సంఘ సభ్యులకు నివాళులు అర్పించారు. అనంతరం సంఘ ఆదాయ వ్యయ జమ పట్టికకు ఆమోదం తీర్మానం పొందారు. అదేవిధంగా ప్రఖ్యాత నటిమణి ఎంఎం రాజ్యంను జీవిత సాఫల్యం అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈమె నడిగర్ సంఘం తొలి మహిళ సభ్యురాలు అన్నది గమనార్హం. కాగా ఈ సమావేశంలో జాతీయ అవార్డు గ్రహీతలు నటి ఊర్వశి, నటుడు ఎంఎస్ భాస్కర్, సంగీత దర్శకుడు జి ప్రకాష్ కుమార్‌లను ఘనంగా సత్కరించారు అదేవిధంగా దాదాసాహెబ్ అవార్డుకు ఎంపికై న నటుడు, మోహన్ లాల్, పద్మభూషణ్ అవార్డును అందుకున్న నటుడు అజిత్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం సర్వసభ్య సమావేశంలో నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం కోసం రూ.25 కోట్లు బ్యాంకులో రుణం తీసుకున్నట్లు, ఇంకా భవన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి మరో రూ.10 కోట్లు అవసరం కోసం అంగీకారం కోరుతూ తీర్మానం చేశారు. అదేవిధంగా సంఘం నూతన భవనములో ఏర్పాటు చేస్తున్న కళ్యాణమండపం, ఇతర కట్టడాలకు కొత్త పేర్లు నిర్ణయించడానికి సంగ నిర్వాహానికి అనుమతి ఉండేలా తీర్మానం చేశారు. అదే విధంగా ఇకపై సంఘ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాముని తీర్మానం చేశారు. ప్రధాన కార్యదర్శి విశాల్ మాట్లాడుతూ బ్యాచిలర్‌గా ఇది తన చివరి సంఘ సర్వసభ్య సమావేశం అని పేర్కొన్నారు. సరిగా సంఘం నూతన భవన నిర్మాణం పూర్తిగా గాని తన వివాహం నటి సాయి దంచికతో జరుగుతుందని పేర్కొన్నారు. సంఘ కోశాధికారి కార్తీక్ మాట్లాడుతూ నూతన భవన నిర్మాణం రూ. 40 కోట్ల భయంతో నిర్మాణం జరుగుతోందని చెప్పారు.