స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2.0 | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2.0

Sep 20 2025 6:26 AM | Updated on Sep 20 2025 6:26 AM

స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2.0

స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2.0

ప్రియుడిని కత్తితో పొడిచిన మహిళ అరెస్ట్‌
మోసపోయానని యువతి ఫిర్యాదు

తిరువళ్లూరు: స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2.0 ద్వారా పారిశుధ్య పనులను రాష్ట్ర మంత్రి నాజర్‌ ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి యూనియన్‌ మేల్‌మనంబేడు గ్రామంలో జరిగిన స్వచ్ఛ భారత్‌ పనులకు కలెక్టర్‌ ప్రతాప్‌ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి నాజర్‌ హాజరయ్యారు. అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల తదితర ప్రాంతాల్లో చెత్తకుప్పలను మంత్రి నాజర్‌ సేకరించారు. ఇంటింటికి వెళ్లి మగ్గిన, మగ్గని కుప్పలను సేకరించి, అవగాహన కల్పించారు. దీంతో పాటు పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొంటామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడంతో పాటు ప్రత్యేక యాప్‌ను విడుదల చేశారు. అనంతరం మేల్‌మనంబేడు గ్రామంలో నూతనంగా 8 మంది పారిశుధ్య కార్మికులతోపాటు పూందమల్లి యూనియన్‌లోని 490 మంది పారిశుధ్య కార్మికులకు భద్రత ఉపకరణాల కిట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి, ప్రాజెక్టు డైరెక్టర్‌ జయకుమార్‌, సీఈఓ మోహన తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రైతు నేతగా

రాజేష్‌ ఖన్నా

సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీ అనుబంధ రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా రాజేష్‌ఖన్నా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ అధిష్టానం ప్రకటించింది. జాతీయ సినీ విభాగంలో డైరెక్టర్‌గా గత కొన్నేళ్లుగా రాజేష్‌ఖన్నా పనిచేస్తూ వచ్చారు. 20 ఏళ్లుగా బీజేపీలో ఉన్న ఆయనకు ప్రస్తుతం తమిళనాడు రైతు విభాగం పదవి దక్కింది.

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

తిరువొత్తియూరు: చైన్నె, మధురవాయిల్‌ ప్రియు డి ఇంటిలో మద్యం తాగిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చైన్నె, రాయపేటలో నివశించే 26 ఏళ్ల యువతి నందనంలో ఉన్న ప్రైవేట్‌ ఆడిటర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈమెకు మదురవాయల్‌లోని ఆలపాకం ప్రాంతంలో నివశించే గణేష్‌రామ్‌ అనే వ్యక్తితో ఇన్‌ స్ట్రాగామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. తరువాత ఇది ప్రేమగా మారింది. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన గణేష్‌రామ్‌ సినిమా డైరెక్టర్‌గా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని స్వస్థలం సేలం. గురువారం సాయంత్రం యువతి పని ముగించుకుని ప్రేమికుడు గణేష్‌రామ్‌ నివశించే గదికి వచ్చింది. తరువాత ఇద్దరూ కలిసి మద్యం తాగినట్లు చెబుతున్నారు. ఆ తరువాత వారు చికెన్‌ వండుకుని తిన్నారు. కొద్దిసేపటికే యువతి కి వాంతులు ప్రారంభమయ్యాయి. ఆమె టాయిలెట్‌కు వెళ్లినప్పుడు కిందపడిపోయింది. ఇందులో నుదురుకు తీవ్ర గాయం తగిలి యువతి మృతి చెందింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన ప్రేమికుడు గణేష్‌రామ్‌ పోలీసులకు, యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం కీల్‌పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఎలా మరణించిందనే దానిపై ఇంట్లో ఉన్న ప్రేమికుడు గణేష్‌రామ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తరువాత తదుపరి విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.

అన్నానగర్‌: అసోంలోని సీల్‌బేరి ప్రాంతానికి చెందిన ఇమ్రాన్‌ సయ్యద్‌ (31). ఇతను ఒరగడం సమీపంలోని చెన్న కుప్పం ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ ఒరగడంలోని ఒక ప్రైవేట్‌ ఫ్యాక్టరీలో లోడ్‌ లిఫ్టర్‌ గా పనిచేస్తున్నాడు. గతంలో, సయ్యద్‌ అసోంలోని కువాడి ప్రాంతానికి చెందిన ఫరిదాబేగం (31)తో పరిచయమైంది. వీరు ఒకే ఇంట్లో సహజీవనం సాగించారు. ఈక్రమంలో సయ్యద్‌ గత కొన్ని నెలలుగా మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీంతో ఫరిదాబేగం మందలించింది. ఈక్రమంలో గురువారం రాత్రి ఆగ్రహించిన ఫరిదాబేగం కత్తితో ఇమ్రాన్‌ సయ్యద్‌ పై దాడి చేసింది. గాయపడ్డ అతను ప్రస్తుతం చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒరగడం పోలీసులు ఫరిదా బేగంను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

నేడు విద్యుత్‌

ఉండని ప్రాంతాలు

అన్నానగర్‌: విద్యుత్‌ బోర్డు నిర్వహణ పనుల కారణంగా నేడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చైన్నెలోని ఈ క్రింది ప్రదేశాలలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగనుంది.

గిండి: లేబర్‌ కాలనీ, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, బాలాజీనగర్‌, నాగిరెడ్డితోట్టం, ఈక్కాట్టు తాంగల్‌, గాంధీనగర్‌ మెయిన్‌ రోడ్‌, సర్ధార్‌ కాలనీ, జేఎన్‌ రోడ్‌, కలైమగల్‌ నగర్‌, అచ్యుతన్‌నగర్‌ 1వ ప్రధాన రహదారి, అరుళైయంపేటై, సౌత్‌, నార్త్‌ కట్‌, ముత్తురామన్‌ స్ట్రీట్‌, గణపతి కాలనీ, టిన్ని సెక్టార్‌, లేజర్‌ స్ట్రీట్‌.

తాంబరం: మెప్స్‌

సెంబియం: సింప్సన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌, హొసుర్‌ గార్డెన్‌, ఐపీఎల్‌ కంపెనీ, బైమెటల్‌ బేరింగ్‌, సింప్సన్‌, టాబే కంపెనీ, టీచర్స్‌ కాలనీ, సంతోష్‌నగర్‌, వీనస్‌ నగర్‌, కడపసాలై, సారథి నగర్‌, కలైమగల్‌ నగర్‌, విల్లివాక్కం రోడ్‌, కంపాబిగై నగర్‌.

ఆవడి: గ్రీన్‌న్‌ఫీల్డ్‌, సోమసుందరం అవెన్యూ, వెంకటాచలం నగర్‌, కమలం నగర్‌, లలితాంబాల్‌ నగర్‌, మదర్‌థెరిసా నగర్‌, వెంకటేశ్వర నగర్‌, ఒరగడమ్‌ సొసైటీ.

ఆళ్వార్‌ తిరునగర్‌: లక్ష్మీనగర్‌, రాధా అవెన్యూ, ఏకే ఆర్నగర్‌, రాధానగర్‌, వేలన్‌ నగర్‌ 5 నుంచి 9వ వీధులు.

ఎగ్మూర్‌: హట్కిన్సన్‌ రోడ్‌, సింగర్‌ స్ట్రీట్‌, సుబ్బయ్య స్ట్ట్రీట్‌, బ్యారక్స్‌ రోడ్‌, సిడెన్‌హామ్స్‌ రోడ్‌, కర్పూరముదలి స్ట్రీట్‌, తిరువెంగడం స్ట్రీట్‌, మట్దుక్కర వీరభద్ర స్ట్రీట్‌, కడూర్‌ సడయప్పన్‌ స్ట్రీట్‌, ముత్తు గ్రామీ స్ట్రీట్‌, చర్చ్‌ రోడ్‌, ఉ గఓ సంపత్‌ రోడ్‌, టెర్మియా రోడ్‌, ఆఏ రోడ్‌, కెల్లీస్‌ రోడ్‌, బ్రాన్‌సోన్‌గార్టన్‌ స్ట్రీట్‌, హోల్‌ వెంకటపతి వీధి, ఎయిర్‌ ఇండియా కాలనీ, సుందర్‌లాల్‌ నార్త్‌ అవెన్యూ, ఆరమ్స్‌ రోడ్‌, లూథరన్‌ గార్డెన్‌ పోలీస్‌స్టేషన్‌, వాసు స్ట్రీట్‌, రాజా రత్తినం స్ట్రీట్‌, డాక్టర్‌ మునియప్ప రోడ్‌, ఈగా థియేటర్‌, ఐ క్వార్టర్స్‌, కేజీ రోడ్‌, ఉమా కాంప్లెక్స్‌, బ్రాన్సన్‌ గార్డెన్‌, పాల్స్‌ రోడ్‌.

అన్నానగర్‌: భర్త తనను మోసం చేశాడని ఒక మహిళ ఆరోపించింది. కాంచీపురంలోని నాగలమేడు ప్రాంతానికి చెందిన దేవిక (29) తనను మోసం చేసి వేరే మహిళను వివాహం చేసుకున్న తన ప్రియుడు శరత్‌కుమార్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు, ఆమె స్పృహ కోల్పోయిన ఘటన కలకలం రేపింది. కాంచీపురానికి చెందిన దేవిక, కాంచీపురంలోని మధురన్‌తొట్ట రోడ్డు నివాసి కార్తీక్‌ను ప్రేమించి పదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. వారికి ఒక బిడ్డ ఉంది. కానీ, కార్తీక్‌ మద్యానికి బానిసయ్యాడు. ఏడేళ్ల క్రితం దంపతులిద్దరూ విడిపోయారు. 2020 సంవత్సరంలో దేవిక ఒక ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసేది. ఈక్రమంలో అక్కడ పనిచేసే వైయవూర్‌కు చెందిన డ్రైవర్‌ శరత్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఆలయం పెళ్లి చేసుకున్నారు. దేవిక గర్భం దాల్చింది. తనకు గర్భస్రావం చేయించాలని శరత్‌కుమార్‌ బలవంతం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. శరత్‌కుమార్‌ సోమవారం మరో పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. శరత్‌కుమార్‌కు రూ.లక్ష నగదు, 3 తులాల నగలు ఇచ్చి మోసపోయానని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement