
మొబైల్ క్లీనిక్ సేవ
ఊపిరితిత్తుల వ్యాధులను ముందుగా గుర్తించి, చికిత్స అందించే విధంగా ఉచిత మొబైల్ లంగ్ క్లీనిక్‌సేవలకు వడపళని కావేరి ఆస్పత్రి గురువారం శ్రీకారం ట్టింది. చైన్నె పోరూర్, పూందమల్లి, అరుంబాక్కం, కోడంబాక్కం, వడపళణి, కోయంబేడు, వలసరవాక్కం, విరుగంబాక్కం, పెరంబూరులతో పాటుగా చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, అరక్కోణం, వేలూరు, కారైకాల్,పుదుచ్చేరి తదితర 30 ప్రాంతాలలో ఉచిత స్క్రీనింగ్ సౌకర్యాలతో ఈ మొబైల్ క్లీనిక్ సేవలు అందించనున్నది. ఈ మొబైల్ వాహనాన్ని గురువారం ఆస్పత్రి సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్, సినీ నటుడు తంబిరామయ్య, పల్మోనాలజిస్టు డాక్టర్ సెల్విలు జెండా ఊపి ప్రారంభించారు. –సాక్షి,, చైన్నె