
ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
తిరుత్తణి: మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ జంయితి సందర్భంగా ఉపాధ్యాయులను డాక్టర్ రాధాకృష్ణన్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగలో ప్రసిద్ధి చెంది శ్రీ దత్తసాయి ఆలయం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులతో పాటూ సమాజకు సేవలందిస్తున్న ప్రముఖులను ఎంపిక చేసి సత్కరించే కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఆలయ చైర్మన్ శ్రీసాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రపంచ దేశాల శాంతిదూత రాజేష్‌కన్నా పాల్గొని పళ్లిపట్టు ఆదర్శ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్ముగంతో పాటు ఆధ్యాత్మికం, సంగీతం. కళలు, సేవాభావంలో ప్రత్యే క గుర్తింపుతో సేవలందిస్తున్న ప్రముఖులు 30 మందికి అవార్డుతో ఘనంగా సత్కరించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బాబాకు విశేష అభిషేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 500 మందికి అన్నదానం పంపిణీ చేశారు.