సొంత కుమారుడిపై లైంగిక వేధింపులు | - | Sakshi
Sakshi News home page

సొంత కుమారుడిపై లైంగిక వేధింపులు

Sep 1 2025 2:57 AM | Updated on Sep 1 2025 2:57 AM

సొంత కుమారుడిపై  లైంగిక వేధింపులు

సొంత కుమారుడిపై లైంగిక వేధింపులు

– కార్మికుడికి 20 ఏళ్ల జైలు

తిరువొత్తియూరు: పెరంబలూరు జిల్లా కున్నం సమీపంలోని కొళపాడికి చెందిన ఒక వ్యక్తి చైన్నెలోని ఓ హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 2023లో తన 14 ఏళ్ల కుమారుడిపై మద్యం, గంజాయి మత్తులో పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతో శారీరకంగా, మానసికంగా ప్రభావితమైన ఆ బాలుడు బడికి వెళ్లడం మానేశాడు. విద్యార్థి బడి మానేయడంపై ఆరా తీసిన పెరంబలూరు జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు, తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు. దీనిపై కున్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ జరిపి పోక్సో చట్టం కింద హోటల్‌ కార్మికుడిని అరెస్టు చేశారు. పెరంబలూరు మహిళా కోర్టులో జరిగిన ఈ కేసులో న్యాయమూర్తి ఇందిరాణి తీర్పు వెలువరించారు. సొంత కుమారుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.50,000 జరిమానా విధించారు. కాగా తీర్పు వెలువడకముందే నిందితుడు కోర్టు ప్రాంగణంలో విషం తాగి వాంతులు చేసుకున్నాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి చికిత్స అందిస్తున్నారు.

నకిలీ కంపెనీలతో

కోట్లాది రూపాయల మోసం

– ఇద్దరు నిందితుల అరెస్టు

అన్నానగర్‌: దేశవ్యాప్తంగా నకిలీ కంపెనీలను నడుపుతూ రూ.203 కోట్లు మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పుదుచ్చేరి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి జైలుకు పంపారు. వివరాలు.. పుదుచ్చే రి నివాసి మహేష్‌ కుమార్‌ మొబైల్‌ ఫోన్‌ నంబర్‌కు ఓ టెక్స్‌ట్‌ మెసేజ్‌ వచ్చింది. అందులోని సూచనల మేరకు.. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం కోసంఆన్‌లైన్‌లో రూ. 68,127 నగదు పంపాడు. అయితే ఉద్యోగం ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇతని ఫిర్యాదు ఆధారంగా, పుదుచ్చేరి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో ఫిర్యాదుదారుడిని మోసం చేసిన వ్యక్తి ఒడిశాకు చెందిన కంకుచరణ్‌ సిబరం ఉద్యోగి అభిషేక్‌ అని తేలింది. వారు మోసం చేసిన డబ్బుతో దుబాయ్‌కు విహారయాత్రకు వెళ్లారని కూ డా వెల్లడైంది. ఇతర దేశాలకు వారు వెళ్లకుండా ఉండడానికి భారత ఇమ్మిగ్రేషన్‌ విభాగం లుకౌట్‌ నోటీసు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో 24వ తేదీన, కంకుచరణ్‌ సిబరం పాణికరం, అభిషేక్‌ దుబాయ్‌ నుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చారు. అక్క డ, భారత విమానయాన శాఖ అధికారులు వారిద్దరినీ పట్టుకుని పుదుచ్చేరి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అప్పగించారు. అరెస్టు చేసిన వ్యక్తులను పుదుచ్చేరికి తీసుకువచ్చి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ నిర్వహించారు. ఆ సమయంలో దిగ్భ్రాంతికరమైన సమాచారం వెల్లడైంది. ఈ ఇద్దరూ 35కి పైగా నకిలీ కంపెనీలను నడుపుతున్నారని, వారిపై 23 రాష్ట్రా ల్లో 1,500 కి పైగా మోసం కేసులు నమోదయ్యా యని వెల్లడైంది. అరెస్టు చేసిన వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న 13 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.203 కోట్లకు పైగా ఆన్‌లైన్‌ మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీని తరువాత కంకుశరణ్‌, అభిషేక్‌ను పుదుచ్చేరి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 100కి పైగా సిమ్‌ కార్డు లు, ఆధార్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. తరువాత, వారిని ఆదివారం పుదుచ్చేరి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి సెంట్రల్‌ జైలుకు పంపారు. ఈ కేసులో ఇంకా చాలా మంది ప్రమేయం ఉందని తెలుస్తుంది. వారిని అరెస్టు చేసే ప్రక్రియలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కూడా పాల్గొంటున్నారు.

కుట్రాలం వెళ్తూ ప్రమాదం

– నలుగురు మృతి

సాక్షి, చైన్నె : సెలవు రోజైన ఆదివారం కుట్రాలం జలాపాతంలో స్నానానికి కారులో బయలుదేరిన వారిని మృత్యువు కబళించింది. కారును మినీ లారీ ఢీ కొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. రామనాథపురం చెట్టియార్‌ వీధికి చెందినగోవిందరాజన్‌(65) తన కుటుంబంతో కలిసి పొరుగున ఉన్న తెన్‌కాశి జిల్లా కుట్రాలం జలపాతంలో స్నానానికి నిర్ణయించారు. ఉదయాన్నే కుటుంబసభ్యులతో కారులో కుట్రాలం వివాహరయాత్రకు బయలు దేరారు. గోవిందరాజన్‌, ఆయన భార్య జమున(55), కుమార్తె రూపిణి(30)లతో కలిసి మనక్కుడికి చెందిన దూరపు బంధువైన డ్రైవర్‌ కాళీశ్వరన్‌(28)కి చెందిన అద్దె కారులో కుట్రాలంకు వెళ్తుండగా ప్రమాదానికి గురి అయ్యారు. కారును కాళీశ్వరన్‌ నడిపాడు. మార్గంమధ్యలోపరమకుడి నెన్‌ మేని ప్రాంతంలో మినీ లారీ వీరి కారును ఢీకొంది. అతి వేగంగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. కారు నుజ్జు నుజ్జైంది. ఇందులో ఉన్న నలుగురు సంఘటనా స్థలంలోనే మరణించారు. మినిలారీలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌ ముత్తు రాజ్‌(47), క్లీనర్‌ లోకానాథన్‌(24), మరో వ్యక్తి (23) గాయపడ్డారు. వీరిని మదురై రాజాజీ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈప్రమాదంతో పరమకుడి మార్గంలో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement