
సేవా సహకారం
మద్రాసు రాయల్ క్లబ్ నేతృత్వంలో చైన్నెలోని అనాధ, వృద్ధాశ్రమాలు, సహాయక కేంద్రాలలో జీవనం సాగిస్తున్న వారికి సహకారంగా సేవలు అందించారు. వారికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు, ఆర్‌ఓ ఓటర్‌తో పాటూ వివిధ సహాయకాలను అందజేశారు. అలాగే మద్రాసు రాయల్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ నిర్మల్ నహ్తా, కార్యదర్శి రతన్ కటారియా, కోశాధికారి రమేష్ దర్దా, మహిళా విభాగం చైర్ పర్సన్ పూనమ్ చాజెద్, కో చైర్‌పర్సన్ సంతోష్, యూత్ వింగ్ చైర్మన్ హర్ష్ బాబెల్, కో చైర్‌పర్సన్ ఖుషి నహ్తాలు ఆయా ఆశ్రమాలలోని 700 మందిని వెంట బెట్టుకుని ఒక రోజంతా తమతో పలు చోట్లకు తీసుకెళ్లారు. అలాగే, ఓ థియేటర్‌ను బుక్ చేసి సినీమా వీక్షించే అవకాశం కల్పించారు. రోజంతా వృద్ధులు,అనాదాలు ఆనందంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. –సాక్షి, చైన్నె

సేవా సహకారం