మలయాళ దర్శకుడితో కార్తీ | - | Sakshi
Sakshi News home page

మలయాళ దర్శకుడితో కార్తీ

Aug 9 2025 5:45 AM | Updated on Aug 9 2025 5:45 AM

మలయాళ

మలయాళ దర్శకుడితో కార్తీ

తమిళసినిమా: ఇండియన్‌ సినిమానే ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కూలీ. కారణం పలువురు బహుభాషా నటీనటులు ఇందులో నటించడం కావచ్చు. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమీర్‌ఖాన్‌, శాండిల్‌వుడ్‌ స్టార్‌ ఉపేంద్ర వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో టాలీవుడ్‌ స్టార్‌ నాగార్జున ప్రతినాయకుడిగా నటించడం విశేషం. శ్రుతిహాసన్‌ ముఖ్యపాత్రను పోషించిన ఈ చిత్రాన్ని లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. అనిరుధ్‌ సంగీతాన్ని అందించిన కూలీ చిత్రం ఈనెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. దీంతో రజనీకాంత్‌ నటించిన ఈ చిత్రంలో ఆయన చిరకాల మిత్రుడు కమలహాసన్‌ వారసురాలు శ్రుతిహాసన్‌ నటించడంతో మరింత క్రేజ్‌ నెలకొంది. ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ పాత్రను చంపేస్తారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనిపై స్పందించిన శ్రుతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ కూలీలో నటించడానికి కమిట్‌ అయినప్పుడే పాత్ర చంపబడుతుందనే ప్రచారం మొదలెట్టారన్నారు. తనకు కూలీ చిత్రంలో ఎలాంటి ఫైట్స్‌ ఉండవని స్పష్టం చేశారు. తాను సత్యరాజ్‌కు కూతురిగా నటించానని చెప్పారు. ఈ చిత్రంలో తాను ఒక హెల్దీ ఈస్త్రోజన్‌ గా తన పాత్ర ఉంటుందన్నారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా శ్రుతిహాసన్‌ పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మిస్కిన్‌ దర్శకత్వంలో నటించిన ట్రైన్‌ చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా నటిస్తున్నారు.

తమిళసినిమా: కోలీవుడ్‌ హీరోలను మాలీవుడ్‌, టాలీవుడ్‌ దర్శకులు ఇంప్రెస్‌ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇంతకు ముందే జోషి, ఫాజిల్‌ వంటి పలువురు దర్శకులు తమిళంలో చిత్రాలు చేసి సక్సెస్‌ అయ్యారు. కాగా తాజాగా నటుడు కార్తీ కూడా ప్రముఖ మాలీవుడ్‌ దర్శకుడితో కలిసి పని చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు కార్తీ. ఈయన నలన్‌ కుమారస్మామి దర్శకత్వంలో నటించిన వా వాద్ధియార్‌ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అలాగే పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో సర్ధాన్‌ 2 చిత్రంతో పాటు, తమిళ్‌ దర్శకత్వంలో మార్షల్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఖైదీ 2 చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల మోహన్‌లాల్‌ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సాధించిన మలయాళ చిత్రం తొడరుమ్‌ కు తరుణ్‌మూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం దర్శకుడు తరువాత తమిళంలో కార్తీ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు నకోలీవుడ్‌ వర్గాల సమాచారం. కాగా ఈ క్రేజీ చిత్రానికి సంబధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దర్శకుడు తరుణ్‌మూర్తి

కూలీలో

నా పాత్ర ఏమిటంటే..

మలయాళ దర్శకుడితో కార్తీ 1
1/4

మలయాళ దర్శకుడితో కార్తీ

మలయాళ దర్శకుడితో కార్తీ 2
2/4

మలయాళ దర్శకుడితో కార్తీ

మలయాళ దర్శకుడితో కార్తీ 3
3/4

మలయాళ దర్శకుడితో కార్తీ

మలయాళ దర్శకుడితో కార్తీ 4
4/4

మలయాళ దర్శకుడితో కార్తీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement