
సెప్టెంబర్ 13న ఇడ్లీకడై ఆడియో విడుదల
తమిళసినిమా: నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఇడ్లీ కడై. నటి నిత్యామీనన్ నాయకిగా నటించిన ఇందులో సత్యరాజ్, రాజ్‌కిరణ్, పార్థిబన్, అరుణ్ విజయ్, షాలిని పాండే ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలింస్, రెడ్ జెయింట్ ఫిలింస్ సంస్థలు నిర్మించాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. తిరుచిట్రంఫ లం చిత్రం తరువాత ధనుష్, నిత్యామీనన్ జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో ఇడ్లీ కడైపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఎన్న సుఖం అనే పాట మంచి ఆదరణ పొందింది. చిత్రం ఆడియోను సెప్టెంబర్ 13న స్థానిక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని అక్టోబర్ ఒకటో తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఇప్పటికే ప్రకటించారన్నది గమనార్హం.