
పీబీకే శ్రేణుల ఆందోళన
ఽతిరువళ్లూరు: డీఎంకే అధికారంలోకి వచ్చిన గత నాలుగేళ్లలో 30 పరువు హత్యలు జరిగాయని, వాటిని నివారించడంతో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని పీబీకే రాష్ట్ర అధ్యక్షుడు కేవీ కుప్పం ఎమ్మెల్యే జగన్‌మూర్తి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరువు హత్యలకు నిరసనగా పీబీకే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. తిరువళ్లూరులో జరిగిన ఆందోళన కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు జగన్‌మూర్తి హాజరై ప్రసంగించారు. గత నాలుగేళ్లలో 30 పరువు హత్య లు జరిగినా వాటిని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పరువు హత్యలను నివారించడంతోపాటు ఇటీవల హత్య కు గురైన కవిన్ కుటుంబానికి న్యాయం చేయాలని, కేసును సీబీఐకి మార్చాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు వ్యవహారంపై జనవరిలో జరగనున్న రాష్ట్ర కమిటీ సభ్యుల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇటీవల బాలుడి కిడ్నాప్ వ్యవహారంలో ఎదుర్కొకుంటున్న ఆరోపణలపై జగన్‌మూర్తి స్పందించడానికి నిరాకరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.