
విమానంలో సాంకేతిక లోపం
కొరుక్కుపేట: చైన్నె నుంచి తిరుచ్చికి వెళ్లే ప్రయాణికుల విమానం బుధవారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరడానికి రనన్‌వేపై సిద్ధంగా ఉంది. విమానంలో 68 మంది ప్రయాణికులు , 5 మంది విమాన సిబ్బంది సహా 73 మంది ఉన్నారు. రన్‌న్‌వేపై టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే, పైలట్ విమానం ఇంజిన్‌న్‌లో సమస్య ఉందని గుర్తించి విమానాన్ని రన్‌న్‌వేపై ఆపేశాడు. పైలట ఇచ్చిన సమాచారంతో ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని పరిష్కరించడానికి ఎయిర్‌లైన్ అధికారులు అక్కడకి చేరుకున్నారు. గంట తర్వాత ఇంజిన్‌లో లోపాన్ని సరిచేసి ఉదయం 6.45 గంటలకు చైన్నె నుంచి తిరుచ్చికి బయలుదేరింది. ఇంజిన్‌లో లోపాన్ని సకాలంలో పైలట్ గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానం ఆలస్యంగా బయలుదేరడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.
ఫిర్యాదులపై చర్యలు తీసుకోండి
కొరుక్కుపేట: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు నగర పోలీసు కమిషనర్ అరుణ్ ఆదేశించారు. బుధవారం చైన్నెలోని పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ఫిర్యాదుల పరిష్కార శిబిరంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి 17 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులపై వెంటనే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు .
రూ.1.32 కోట్ల పన్ను మోసం
ఇద్దరు ఉద్యోగుల తొలగింపు
కొరుక్కుపేట: తాంబరం కార్పొరేషన్‌లో పన్ను రూపంలో వసూలు చేసిన నగదును దోచుకున్న ఇద్దరిని ఉద్యోగం నుంచి తొలగించారు. తాంబరం కార్పొరేషన్‌న్‌లోని జోన్–4లో పన్ను వసూలు చేసే రాణి అనే ఉద్యోగి ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.కోటి వసూలు చేసి, బ్యాంకుకు చెల్లించకుండా నకిలీ రశీదులను అధికారులకు సమర్పించిందని ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఆ మొత్తాన్ని వసూలు చేసి, రాణిని సస్పెండ్ చేశారు. అదేవిధంగా, ప్రస్తుతం జోన్ 5లో పనిచేస్తున్న ఉద్యోగి మురళి జనవరి నుంచి మార్చి వరకు రూ.32 లక్షల పన్ను వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. మురళిని ఉద్యోగం నుంచి తొలగించి నగదును రికవరీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జోన్ అధికారి విజయలక్ష్మికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు
కాణిపాకంలో నటి రమ్యకృష్ణ
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని బుధవారం సినీ నటి రమ్యకృష్ణ దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన సేవ కార్యక్రమాలను దగ్గర ఉండి చూశారు. వేద ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనాలు చేశారు. సిబ్బంది వాసు, బాలాజీ ఆమెకు చిత్ర పటం, ప్రసాదం అందజేశారు.
వైభవంగా ప్రదోషపూజలు
నాగలాపురం: మండలంలోని సురుటుపళ్లి గ్రామంలో ప్రదోష క్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పళ్లికొండేశ్వర స్వామి ఆలయంలో బుదవారం ప్రదోష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల ఓం నమశ్శివాయ స్మరణలతో ఆలయం మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేశన్ గురుక్కల్ ఆలయంలోని నందీశ్వర స్వామికి శ్రీ వాల్మీకేశ్వర స్వామికి ఏకకాలంలో పూజలు నిర్వహించారు. ఈ ప్రదోష పూజలకు నిండ్ర గ్రామానికి శ్రీనివాస మిల్క్ డెయిరీ ఎండీ వాసుదేవనాయుడు, వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు.

విమానంలో సాంకేతిక లోపం

విమానంలో సాంకేతిక లోపం