
ఇండియన్– 3
బూజు దులపనున్నారా?
బ్లాక్ మెయిల్‌లో బలమైన పాత్ర
తమిళసినిమా: మంచి గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న తమిళ నటి తేజు అశ్విని. ఈమె మంచి డాన్సర్ అదేవిధంగా మంచి కొరియోగ్రాఫర్ మొదట్లో కొన్ని యూట్యూబ్ ఛానల్ లో నటించిన ఈ బ్యూటీ 2022లో కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేశారు. అదే ఏడాదిలో ఎన్న సొల్ల పోగిరాయ్ అనే చిత్రంలో నాయకిగా నటించారు. కొన్ని చిత్రాల్లో నటించిన తేజు అశ్విని ఇటీవల నటుడు సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్‌తో కలిసి పటాక్ పటాక్ అనే ప్రైవేటు ఆల్బమ్‌లో నటించారు. ఆ ఆల్బమ్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది. దీంతో జీవీ ప్రకాష్ కుమార్ తను కథానాయకుడిగా నటించిన బ్లాక్ మెయిల్ చిత్రంలో నాయకిగా నటించే అవకాశం కల్పించారు. ఎం మారం దశరథ వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఆగస్టు ఒకటవ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బ్లాక్ మెయిల్ చిత్రంలో నటించిన అనుభవాన్ని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నటి తేజు అశ్విని కోరుకుంటూ తాను ఇప్పటివరకు ఎనర్జీ యూత్ ఫుల్ కథ పాత్రలోనే నటించానని అయితే బ్లాక్ మెయిల్ చిత్రంలో ఇంతకుముందు ఎప్పుడు నటించనటువంటి భావోద్వేగాలతో కూడిన పాత్రను పోషించినట్లు చెప్పారు. సాధారణ కంటే పలు పరిశోధనల ప్రయత్నంతో కూడిన నటనను ప్రదర్శించినట్లు చెప్పారు. ఈ చిత్రంలో నటించడం ఎంతో అనుభవంగా పేర్కొన్నారు. దర్శకుడు మారన్ ఇంతకుముందు తెరకెక్కించిన ఇరవుక్కు ఆయిరం కన్ గాళ్, కన్నై నంబాదే చిత్రాల్లో కథానాయకి పాత్రలకు నటనకు అవకాశం ఉండే విధంగా రూపొందించారన్నారు. దీంతో బ్లాక్ మెయిల్ చిత్రంలోనూ నాకు ప్రాధాన్యత ఉంటుందన్న నమ్మకంతో వెంటనే నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. అదేవిధంగా ఇంతకముందు జీవీ ప్రకాష్ కుమార్‌తో ఓ కలర్ ఫుల్ మ్యూజిక్ వీడియోలో నటించినట్లు చెప్పారు. అయితే ఈ చిత్రంలో తన పాత్ర అందుకు పూర్తి భిన్నంగా బలమైనదిగా ఉంటుందన్నారు. సాంకేతిక పరంగాను స్క్రీన్ ప్లే పరంగానూ అనూహ్య ఘటనలతో చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తేజు అశ్విని వెల్లడించారు.

ఇండియన్– 3